Taraka Ratna: బెంగుళూరుకు చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాలయ్య రియాక్షన్ ఇదే!

కుప్పంలోని పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న హఠాత్తుగా గుండె నొప్పితో ఒక్కసారిగా కింద పడిపోయిన విషయం తెలిసిందే. ఇక హఠాత్తుగా హాస్పిటల్కు తీసుకువెళ్లిన తర్వాత వైద్యులు అతన్ని మళ్ళీ సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కుప్పంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందుకున్న తర్వాత తారకరత్నను బెంగళూరు హాస్పిటల్ కు తరలించారు.

అయితే ఈ తరుణంలో కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అందరు కూడా బెంగళూరుకు వెళుతున్నారు. ఇక బాలకృష్ణ మళ్ళీ లేటెస్ట్ గా తారకరత్న ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాలలోకి వెళితే..

తారకరత్న ఆరోగ్యం గురించి..

తారకరత్న ఆరోగ్యం గురించి..

నందమూరి బాలకృష్ణ రెండు రోజుల నుంచి కూడా బెంగళూరు తారకరత్న ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కువగా ఆయన హాస్పిటల్ లోనే ఉంటున్నారు. బెంగళూరుకు తరలించడంలో కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయనే స్వయంగా తారకరత్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా..

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా..

ఇప్పటికే బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తారకరత్న కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ అలాగే మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా బెంగళూరు హాస్పిటల్ కు చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ప్రత్యేకంగా ఫ్లైట్లో..

జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే కాకుండా మరి కొంతమంది నందమూరి సోదరులు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా ఎన్టీఆర్ తో పాటు ప్రత్యేకంగా ఫ్లైట్లో వచ్చారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారకరత్న ఆరోగ్యం బాగోలేనప్పుడే ఎన్టీఆర్ బాలకృష్ణ కు ఫోన్ చేసి కూడా మాట్లాడారు.

బాలకృష్ణ మరో వివరణ

బాలకృష్ణ మరో వివరణ

ఇక నందమూరి బాలకృష్ణ బెంగళూరు హాస్పిటల్ లో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతమైతే తారకరత్న పరిస్థితి నిలబడగానే ఉంది అని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నాట్లుగా తెలియజేశారు. ఇక స్టంట్ వేయడం కుదరలేదు అని మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా కొంచెం ఉంది అని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

సోమవారం రోజు అసలు క్లారిటీ

సోమవారం రోజు అసలు క్లారిటీ

తారకరత్న కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక బాలకృష్ణ మాత్రం మొదటి నుంచి కూడా తారకరత్న తప్పకుండా మళ్లీ సాధారణ పరిస్థితిలోకి వస్తారు అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కానీ సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అని కూడా మరి కొందరు చెబుతున్నారు. ఇక సోమవారం రోజు పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అని కూడా మరి కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X