NTR30: మరోసారి ఫైర్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. ఈసారి మామూలుగా ఉండదట
పేరున్న కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన రీతిలో అలరిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR మూవీ పుణ్యమా అని అతడి పేరు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయింది. ఫలితంగా తారక్ రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి ఈ స్టార్ హీరో మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు యంగ్ టైగర్ తన 30వ సినిమాను చేస్తోన్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డ విషయం తెలిసిందే.
బడా డైరెక్టర్ కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను చేస్తోన్నాడు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించినా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో గత మార్చిలోనే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో, రెండో దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లలో జరిపారు. వీటిలో తారక్‌తో పాటు ప్రధాన పాత్రలు చేస్తోన్న స్టార్లపై కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వచ్చే వారం నుంచి ప్రారంభించబోతున్నారని తాజాగా తెలిసింది. పది రోజుల పాటు జరగనున్న ఇందులో ఎన్టీఆర్‌పై మేజర్ ఫైరింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తారని సమాచారం. దీనికోసం నగరంలోని ప్రముఖ స్టూడియోలో ఓ సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు ప్రస్తుతం దాదాపుగా పూర్తి అయ్యాయని టాక్. దీని తర్వాత మరో షెడ్యూల్‌లో బ్లూ మ్యాట్‌పై కొన్ని క్రేజీ సీక్వెన్స్‌లను తీయబోతున్నారని తెలిసింది. ఇందులోనూ తారక్ పాల్గొంటాడట.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











