NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి పవర్‌ఫుల్ డైలాగ్ లీక్.. అబ్బా ఏముంది భయ్యా!

సాధారణంగా స్టార్ హీరోలు ఎవరైనా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు వరుసగా విజయాలు దక్కుతూ ఉంటే.. ఇంక ఏ రేంజ్‌లో దూసుకుపోతుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే స్టేజ్‌లో ఉన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

ఏకధాటిగా సక్సెస్‌లను సొంతం చేసుకుంటోన్న అతడు.. RRR అనే చిత్రంతో మరో పాన్ ఇండియా రేంజ్‌ హిట్‌ను అందుకోవడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

Jr NTR and Koratala Movie Powerful Dialogue Leaked

జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఇది చాలా లేట్ అయిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అని అంతా అనుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను జరుపుకుని.. ఆ వెంటనే ఈ చిత్రం షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ జాతర సెట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఇండియన్ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంతో వైల్డ్‌గా ఉంటుందని దర్శకుడు కొరటాల ముందే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పవర్‌ఫుల్ డైలాగ్ లీకైంది. 'సమయం యుద్ధాన్ని కోరినప్పుడు.. ప్రకృతి తన సారథిని పంపిస్తుంది.. ప్రకృతి కోరలను బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం' అని ఉన్న ఈ డైలాగ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇక, ఇందులోని పదాలు ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X