Don't Miss!
- Lifestyle
ఖాళీ కడుపుతో పండ్లు, ఎండుద్రాక్ష తినే వారు, ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి
- News
మరో పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయనున్న కేసీఆర్: వరంగల్‌లో హరీశ్ రావు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
NTR30 Release Date: ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన యూనిట్
నందమూరి తారక రామారావు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూసిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. దీనికితోడు రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగి తన రేంజ్ పెంచుకున్నాడు.
బికినీ సైజ్ తగ్గించిన సీరియల్ నటి: టెంప్ట్ చేసే షేపులతో బాబోయ్!
టాలీవుడ్ ఆల్‌రౌండర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న ఈ మూవీ అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వేట మొదలెట్టడంతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా పూర్తి చేసి త్వరలోనే మొదలెట్టబోతున్నట్లు చెప్పారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్లు వచ్చాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తాజాగా ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో తారక్ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని కనిపించాడు. ఇక, ఈ పోస్టర్‌పైనే దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్లు కూడా తెలిపారు. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పొచ్చు. దీనికి కారణం దీన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారని తెలియడమే.
హీరోయిన్ ప్రణిత గ్లామర్ షో: వైట్ టాప్‌లో దాగని పరువాలతో నాటీగా!
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.