NTR30 Pooja: ఎన్టీఆర్ కోసం ఏకమైన టాలీవుడ్.. పూజకు ఎవరెవరు వచ్చారంటే!

కొంత కాలంగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లోనే తొలిసారి భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ఆస్కార్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు తన 30వ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. అయితే, ఇది ఆగిపోయిందని చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో అనుమానాల నడుమ ఈ ప్రాజెక్టు మొదలు కాబోతున్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ముందుగా నిర్మాతలు నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో పూజారి దేవుడి చిత్ర పటాలకు పూజా కార్యక్రమాలు చేయించారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌తో పాటు గెస్టులుగా వచ్చిన ప్రముఖులందరితోనూ కొబ్బరికాయలు కొట్టించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో వైభవంగా జరిగింది.

Jr NTR and Koratala Shiva Finishes Their Movie Pooja Ceremony

RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల కోసం టాలీవుడ్‌లోని సినీ ప్రముఖులు విచ్చేశారు. అందులో ఆస్కార్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, ప్రశాంత్ నీల్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు, దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ నిర్మాతలు, సీనియర్లు బాపినీడు, కేఎస్ రామారావు, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా విచ్చేశారు. ఇందులో జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఆమెతో రాజమౌళి చాలా సేపు ముచ్చటించారు.

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X