NTR30: ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని విధంగా ప్లాన్
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మూవీ నుంచి వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంలో ఉన్న అతడు గత ఏడాది విడుదలైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీనికితోడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడంతో పాటు తన రేంజ్‌ను ఆస్కార్ స్థాయికి పెంచుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 30వ సినిమాను బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి సన్నద్ధం అవుతోన్నాడు.
RRR సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత గురూజీని కాదని మరో డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఇది ఉంటుందా? లేదా? అన్న డౌట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ వరుసగా దీని నుంచి అప్‌డేట్లు ఇవ్వడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

'జనతా గ్యారేజ్' వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే అధికారికంగా మొదలు పెడతామని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు తాజాగా తెలిసింది. అంతేకాదు, దీన్ని దేశం మొత్తం చూసేలా ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నారట. ఇందుకోసం చాలా మంది స్టార్లకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మార్చి నెలలోనే ప్రారంభం కాబోతుంది. దీనికోసం సెట్ వర్క్ హైదరాబాద్, గోవాలో శరవేగంగా జరుగుతోంది.
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











