NTR30: కొత్త డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్.. లేట్ అయినా ఊహించని విధంగానే!
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మూవీ నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంలో ఉన్న ఈ స్టార్ హీరో గత ఏడాది విడుదలైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీనికితోడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడంతో పాటు తన రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి పెంచుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 30వ సినిమాను బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యాడు.
'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఎప్పుడో ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే దీన్ని ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని అనుకున్నారు. అంతలోనే నందమూరి తారకరత్న మరణించారు. దీంతో ఈ పూజా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త డేట్ గురించి ఓ క్రేజీ వార్త ఫిలిం నగర్‌లో వైరల్‌గా మారింది.

క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మార్చి 18వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు తాజాగా తెలిసింది. అంతేకాదు, దీన్ని దేశం మొత్తం చూసేలా ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నారని అంటున్నారు. ఇందుకోసం చాలా మంది స్టార్లకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మార్చి నెలలోనే ప్రారంభం కాబోతుంది. దీనికోసం సెట్ వర్క్ హైదరాబాద్, గోవాలో దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











