NTR30: ఆరోజే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగ.. ఆ పోస్టర్ ఏంటి భయ్యా!

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో భారీ ఇండస్ట్రీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడంతో పాటు తన రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు తన 30వ సినిమాను టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతోన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఎన్నో రకాల అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే దీన్ని ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు.

అంతలోనే ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న మరణించారు. దీంతో ఈ పూజా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త డేట్ గురించి చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వెలువడింది.

Jr NTR and Koratala Shiva Movie Pooja Ceremony on March 23rd

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను మార్చి 23వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఇందులో సముద్రం, ఓ బలమైన ఆయుధాన్ని చూపించారు. ఇక, ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం చూసేలా ఎంతో గ్రాండ్‌గా జరపబోతున్నారని తెలిసింది. ఇందుకోసం చాలా మంది స్టార్లకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. అలాగే, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా మార్చి నెలలోనే ప్రారంభం కాబోతుంది. దీనికోసం సెట్ వర్క్ హైదరాబాద్, గోవాలో దాదాపుగా పూర్తయ్యాయి.

Jr NTR and Koratala Shiva Movie Pooja Ceremony on March 23rd

భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X