NTR30: ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న నందమూరి హీరోలు
ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బందులు పడినా.. ఇటీవలి కాలంలో మాత్రం ఏకధాటిగా హిట్లు మీద హిట్లను ఖాతాలో వేసుకుంటూ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో మరో సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని కూడా దక్కించుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఎన్టీఆర్ తన 30వ సినిమాను బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి రెడీ అయిపోయాడు.
వాస్తవానికి RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత అది పక్కన పెట్టేసి మరో డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఇది ఉంటుందా? లేదా? అన్న డౌట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్ వరుసగా దీని నుంచి అప్‌డేట్లు ఇవ్వడం మొదలెట్టింది. ఈ క్రమంలోనే పూజా కార్యక్రమాలకు కూడా సన్నద్ధం అయిపోయింది.

'జనతా గ్యారేజ్' వంటి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24వ తేదీన జరపాలని యూనిట్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న మరణించారు. దీంతో ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన వదిలింది. అందులో 'ఎన్టీఆర్ 30వ సినిమా పూజను ఫిబ్రవరి 24న ప్లాన్ చేశాం. కానీ, నందమూరి ఫ్యామిలీలో జరిగిన దుర్ఘటన వల్ల దీన్ని వాయిదా వేస్తున్నాం. కొత్త డేట్‌ను సరైన సమయంలో ప్రకటిస్తాం' అని వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











