కొరటాల శివ మూవీ కోసం ఎన్టీఆర్ కీలక నిర్ణయం: అది రాకముందే ఇది మొదలు
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ జోష్‌లోనే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇది ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోక ముందే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
RRR పట్టాలపై ఉన్న సమయంలోనే ఎన్టీఆర్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి కొరటాల శివతో జత కట్టాడు. హిట్ కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రకటన సమయం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో కానీ.. అక్టోబర్ మొదటి వారం నుంచి కానీ ప్రారంభం కాబోతుందట. అంటే RRR విడుదల కాకముందే యంగ్ టైగర్ మరో సినిమా మొదలవుతుందన్న మాట. అప్పటి కల్లా అటు కొరటాల.. ఇటు ఎన్టీఆర్ తమ తమ ప్రస్తుత సినిమాలను కంప్లీట్ చేసుకుంటారు.

ఎన్టీఆర్.. కొరటాల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని టాక్. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకుంటున్నారని అంటున్నారు. దీనికి అనిరుథ్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయని టాక్.


Click it and Unblock the Notifications











