దేవర2 స్టోరీ లీక్ చేసిన ఎన్టీఆర్.. అస్థిపంజరం అతడిదే, కొరటాల హింట్

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర చిత్రం ఘన విజయం సాధించింది. తొలుత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కోలుకుని సక్సెస్ కొట్టింది. కేవలం విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుని బయ్యర్లకు లాభాలను తెచ్చిపెట్టాడు దేవర. అన్నింటికి మించి దర్శకుడు కొరటాల శివకు బిగ్‌ రిలీఫ్‌ను కలిగించింది. అయితే పార్ట్1లో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ఉండగా.. పార్ట్2లో వాటికి ఆన్సర్స్ ఇస్తామని శివ చెప్పారు. ఈ వివరాలు మీ కోసం.

ఆచార్య తర్వాత కసిగా కొరటాల తెరకెక్కించిన మూవీ ఇది. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కొరటాల. రెండు పార్ట్‌లుగా రాబోతున్న ఈ సినిమాలో తొలి భాగంలో ఏం చూపించాలి, సెకండ్ పార్ట్‌ ఎలా ఉండాలన్న అంచనాతో కొరటాల స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ విషయాన్ని సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దేవర మొదలైనప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వు లేదని, టెన్షన్ పడుతూనే షూటింగ్ చేశాడని గుర్తుచేశారు. రీ రికార్డింగ్, డబ్బింగ్ సమయంలో భయపడుతున్న కొరటాలకు అనిరుధ్ ధైర్యం చెప్పి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నాడని.. అతను అన్నట్లుగానే దేవర ప్రభంజనం సృష్టించిందని తారక్ అన్నారు.

jr ntr and koratala siva leaked devara 2 story here s the details

ఏపీ, తమిళనాడు బోర్డర్‌లోని రత్నగిరి ప్రాంతంలోని సముద్రానికి దగ్గరగా ఉండే కొండపై నాలుగు ఊళ్లని కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తారు. అక్కడి ప్రజల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్)లు వాళ్ల ముఠాతో కలిసి అటుగా వెళ్లే నౌకలపై దాడి చేసి దోపిడీలు చేస్తుంటారు. వీళ్ల ద్వారా మురుగ (మురళీశర్మ) గ్యాంగ్ .. ఆయుధాలను ఒడ్డుకు చేరుస్తుంటాడు. అయితే ఇది ఎప్పటికైనా తమకే ముప్పుగా మారుతుందని గ్రహించిన దేవర ఆ పనులను మానేసి వేరే రకంగా ఉపాధి పొందుతాడు.

కానీ భైర మాత్రం ఈ పనులను చేస్తుండగా దేవర అడ్డుపడతాడు. దీంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని భైర భావిస్తాడు. దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూనే భైర గ్యాంగ్‌ని ఎదుర్కొంటాడు. దీంతో అతనికి భయపడి సముద్రంలోకి వెళ్లాలంటేనే భైర గ్యాంగ్ భయపడుతుంది.. అలా ఎన్నాళ్లు కొనసాగింది, దేవర కొడుకు వర (ఎన్టీఆర్), అతనిని ప్రేమించిన తంగం (జాన్వీ కపూర్) ఎవరు అన్నదే ఈ చిత్ర కథ. సెకంట్ పార్ట్‌పై ఉత్కంఠ కలిగించడానికి, హైప్ తీసుకురావడానికి కొరటాల కొన్ని ట్విస్ట్‌లు పెడతాడు. ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న అస్థిపంజరాలు ఎవరివి అన్న దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు.

తాజాగా స్టార్ యాంకర్ సుమ ఈ విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది. కొరటాల శివ, ఎన్టీఆర్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుమ అస్థిపంజరాల గురించే ప్రశ్నించింది. దీనిపై కొరటాల మాట్లాడుతూ.. చాలా అస్థిపంజరాలు ఉన్నాయని, ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యక్తిదని చెప్పారు. ఆ వ్యక్తిని సినిమాలో ఆల్రెడీలో చూశామా, లేక చూడబోతున్నామా అని సుమ ప్రశ్నించగా.. అన్ని చెబితే కుదరదని కొరటాల అంటాడు. మధ్యలో ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్‌వి కాదు.. మేం క్రిమినల్స్ కాదు అంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X