HBD Jr NTR: క్రూరమైన గెటప్‌లో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ మాస్ ట్రీట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. రూపమే కాదు.. నటనలోనూ తాతకు తగ్గ మనవడిగా సత్తా చాటుతూ దాదాపు ఇరవై ఏళ్లుగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ యమ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. ఇక, గురువారమే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే తన 31వ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు వెల్లడించాడు. దీన్ని కొరటాల శివ మూవీ తర్వాత మొదలు పెడుతున్నట్లు కూడా ప్రకటించాడు. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ కూడా ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్'ను పూర్తి చేస్తాడని అన్నారు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు, ఖాళీ సమయంలో ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

Jr NTR and Prashanth Neel Movie First Look Released

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో డార్క్ కలర్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎన్టీఆర్ టెర్రిఫిక్ లుక్‌తో దర్శనమిచ్చాడు. ఇక, దీనికి 'రక్తంతో తడిసి ముద్దైన చరిత్రనే ఈ నేల గుర్తు పెట్టుకుంది.. అతని నేల.. అతని చరిత్ర.. కానీ అది అతని రక్తం కాదు' అని ఓ డైలాగ్‌ను కూడా వదిలారు. దీంతో ఈ సినిమాలో మాస్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. ఇక, ఈ మాసివ్ పోస్టర్‌కు నందమూరి అభిమానులే కాకుండా.. అందరి నుంచి భారీ స్పందన దక్కుతోంది.

ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కూడా రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా చేయబోతున్నాడు. ఇక, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ చిత్రానికి 'మిస్సైల్', 'న్యూక్లియర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X