ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే బొనాంజా.. ముందుగానే ప్రశాంత్ నీల్ మూవీ
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అందుకే ఈ బడా హీరో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు తారక్ 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న 'దేవర' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తాడు. ఇప్పటికే ఈ షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేట్ అవబోతుంది.
హై రేంజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి వచ్చేసింది.
ఈరోజు (మే 20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని NTR31 మూవీ నుంచి అతడికి శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టు చేసింది. ఇందులో ఈ సినిమాను 2024 ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంటే.. అంతకు ముందు నుంచే ఈ మూవీ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇది తారక్ అభిమానులకు బర్త్‌డే బొనాంజా అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











