NTR31 షూట్, రిలీజ్ డేట్‌ లీక్.. ఎన్టీఆర్ తల్లి వల్ల నిర్ణయం మార్పు.. సౌతిండియాలో మరో సంచలనం

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా పరిచయం అయినా.. కెరీర్ ఆరంభం నుంచీ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీనిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూసేయండి!

వరుస హిట్లతో ఫుల్ ఫామ్

వరుస హిట్లతో ఫుల్ ఫామ్

ఒకానొక సమయంలో హిట్లు లేక ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి తారక్ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తోన్నాడు.

అంతర్జాతీయ స్థాయిలోకి

అంతర్జాతీయ స్థాయిలోకి

వరుస హిట్లతో జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. అంతేకాదు, దీనితో అతడి రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.

కొరటాల మూవీ లైన్‌లోనే

కొరటాల మూవీ లైన్‌లోనే

RRR చేస్తున్నప్పుడే తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి అయింది. ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి నుంచి మొదలు పెట్టబోతున్నారు.

ప్రశాంత్ నీల్‌తో సినిమా

ప్రశాంత్ నీల్‌తో సినిమా

ఫ్యూచర్ ప్రాజెక్టులను జూనియర్ ఎన్టీఆర్ వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు.

అప్పటి నుంచే మొదలు

అప్పటి నుంచే మొదలు

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే డిసెంబర్ నుంచి ప్రారంభించబోతున్నారట. అంతేకాదు, కేవలం ఒకే ఒక్క ఏడాదిలో పూర్తి చేసి 2024 డిసెంబర్‌లో దీన్ని విడుదల చేస్తారని తాజాగా తెలిసింది.

ఒకేసారి రెండు భాషల్లో

ఒకేసారి రెండు భాషల్లో

భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని కూడా ఓ న్యూస్ లీకైంది. అంటే దీన్ని ద్విభాషా చిత్రంగా తీసుకు రాబోతున్నారన్న మాట. దీనికి కారణం ఎన్టీఆర్‌ తల్లి షాలినీ కర్నాటకకు చెందిన వారు కావడంతో పాటు అతడికి ఆ రాష్ట్రంలో క్రేజ్ భారీగా పెరగడమే అని తెలిసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సౌత్‌లో సంచలనం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X