NTR31: వేట మొదలు పెట్టేసిన డ్రాగన్.. ఎన్టీఆర్‌ కోసం వచ్చింది వాళ్లే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో ఎంతో కాలంగా స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేసుకోవడంతో పాటు రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తోన్న హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతూ దుమ్ములేపుతున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గా మారి సత్తా చాటుతున్నాడు.

భీకరమైన ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. దీనితో పాటు తారక్ బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగానే సాగుతోంది. ఇవి కాకుండా ప్రశాంత్ నీల్‌తోనూ మూవీ ప్రకటించాడు.

Jr NTR and Prashanth Neel Movie Started With Pooja Ceremony

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. ఈ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో వచ్చినా షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి సర్‌ప్రైజ్ వచ్చేసింది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యామిలీ, కల్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. తారక్ భార్య ప్రణిత ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టినట్లు తెలిసింది.

Jr NTR and Prashanth Neel Movie Started With Pooja Ceremony

పూజా కార్యక్రమాలు నిరాడంబరంగా జరిగిన వెంటనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. దీన్ని 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Read more about: jr ntr prashanth neel ntr31
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X