For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tiger Vs Cheetah: ఎన్టీఆర్ లంబోర్ఘినీతో చరణ్ ఫెరారీ పోటీ.. RRR ప్యాకప్‌తో భలే జంప్!

  |

  తెలుగు ప్రేక్షకులు మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా రాజమౌళి సినిమాలో నందమూరి తారకరామారావు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు చేస్తుండడంతో ఇక ఈ సినిమా గురించి మాట్లాడని రోజు అంటూ ఉండటం లేదు. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈ రోజు పూర్తయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.. అయితే స్కూల్ పిల్లలు ఎలా అయితే స్కూలు అయిన వెంటనే ఇంటికి పరిగెడతారో షూటింగ్ అయి పోయిన వెంటనే రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా తమ తమ కార్లలో రేసింగ్ పెట్టుకుని మరీ షూటింగ్ స్పాట్ నుంచి బయటపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఎన్టీఆర్ క్రేజ్

  ఎన్టీఆర్ క్రేజ్

  చివరిసారిగా అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ రాజమౌళి తో జట్టు కట్టాడు. అంతకుముందే సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండటంతో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో ఎన్టీఆర్ భాగం అయ్యారు. ఈ సినిమాలో ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్స్ అలాగే కొన్ని గ్లిమ్స్ కూడా ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం మీద హింట్ ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో నందమూరి అభిమానులు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

   రామ్ చరణ్ ఫాన్స్

  రామ్ చరణ్ ఫాన్స్

  దాదాపు మెగాభిమానులు పరిస్థితి కూడా అంతే చివరిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చరణ్ మళ్లీ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన చరణ్ లుక్స్ అలాగే కొన్ని పోస్టర్ లు కూడా మెగా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచాయి. ఎలా అయినా ఈ సినిమాతో రామ్ చరణ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని వాళ్లు భావిస్తున్నారు.

  వాళ్ళిద్దరూ కలిస్తే

  వాళ్ళిద్దరూ కలిస్తే

  ఇక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అల్లూరి సీతారామరాజు తెలంగాణకు చెందిన కొమురం భీం కలిసి పని చేసినట్లు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక వారిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది వారి కలయిక తో కొన్ని కల్పిత సీన్లు రాసుకుని రాజమౌళి ఏకంగా ఒక సినిమా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 400 కోట్ల రూపాయలు బడ్జెట్ గా ఉంది.. సగానికి సగం హీరో హీరోయిన్లు అలాగే ఇతర నటీనటులు దర్శక టెక్నీషియన్ల రెమ్యునిరేషన్ కోసం భారీగా ఖర్చు అవుతుంది. దానికి తోడు ఇతర దేశాల్లో షూటింగ్ అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కి కూడా భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

   రిలీజ్ డేట్ టెన్షన్

  రిలీజ్ డేట్ టెన్షన్

  అయితే ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీ 2021 సంవత్సరం లో విడుదల అవుతోందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు విడుదల చేసిన ఫోటోలు మాత్రమే విడుదల చేసి తేదీ మిస్ చేశారు. దీంతో విడుదల తేదీ మీద ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కొద్ది రోజుల్లో అధికారికంగా కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి కార్ల రేస్ ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక వీడియో విడుదల చేశారు సినిమా యూనిట్.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
   టైగర్ వర్సెస్ చీతా

  టైగర్ వర్సెస్ చీతా

  ఇక వాళ్ళు విడుదల చేసిన వీడియోలో టైగర్ వర్సెస్ చీతా అని పేర్కొనగా ఎన్టీఆర్ తాజాగా కొన్న లాంబోర్గినీ కారు ముందు వెళుతుండగా రామ్ చరణ్ ఫెరారీ కారు వెనుక దానితో రేసులో ఉన్నట్టు చూపించారు. నిజానికి రెండు కార్లు కూడా రామోజీ ఫిలిం సిటీ రోడ్డు మీద ఇలా కనువిందు చేశాయి. ఇక ఈ రోజుతో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మీద జక్కన్న పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా ఆయన చేసే అన్ని సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే చాలావరకు గ్రాఫిక్స్ వరకు పూర్తిగా వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న ఈ సినిమా విషయంలో ఎంతో కొంత ఆలస్యంగా జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.. మరి చూడాలి ఈ సినిమా రిలీజ్ ఎప్పటి వరకు చేసే అవకాశం ఉంటుంది అనేది.

  English summary
  Jr NTR and Ram Charan car race after wrapping up their last shot for RRR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X