For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday SS Rajamouli: స్పెషల్ ఫొటోలతో విషెస్ అంధించిన తారక్, చరణ్

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో RRR సినిమా టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. మొదటిసారి ఇండియన్ హిస్టరీ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు తప్పకుండా సినిమా పాన్ ఇండియా మార్కెట్ ను మరో స్థాయికి తీసుకు వెళుతుందని కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పై కూడా ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. RRR హీరోలు ప్రత్యేకంగా ఫోటోలను జతచేసే అభిమానులకు ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు.

  రిలీజ్ డేట్ ఫిక్స్

  రిలీజ్ డేట్ ఫిక్స్

  రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గారు జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గత ఏడాది నుంచి వాయిదాల పర్వం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి జనవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ తేదీ పై కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి కానీ ఫైనల్ గా అదే డేట్ ఫిక్స్ చేసినట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

  అల్లూరి స్పెషల్ ట్వీట్

  అల్లూరి స్పెషల్ ట్వీట్

  దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు అలాగే అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరన్ బ్రిటీష్ అధికారి గా రాజమౌళితో సరదాగా నవ్వుతున్న ఫొటోను షేర్ చేశాడు. నేను ఆయనని అనేక విధాలుగా చూస్తున్నాను అలాగే అతని సింపుల్సిటి ద్వారా చిత్రీకరించిన బలాన్ని ఆరాధిస్తాను.. అంటూ రాజమౌళి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు.. అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

  లవ్ యూ జక్కన్న

  లవ్ యూ జక్కన్న

  ఇక కొమరం భీమ్ గా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా పేర్కొన్నారు. తారక్ రాజమౌళిని జక్కన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటాడు. ఇక అదే తరహాలో హ్యాపీ బర్త్ డే జక్కన్న అని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా లవ్ సింబల్ తో లవ్ యూ అని పేర్కొన్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ లో దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. వీరి కలయికలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మరొక బిగెస్ట్ మూవీ RRR ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  సాలీడ్ బిజినెస్

  సాలీడ్ బిజినెస్

  RRR సినిమాను డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ లో దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా నందమూరి హీరోలు కలిసి నటిస్తుండడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 900కోట్లు దాటినట్లు తెలుస్తోంది. తప్పకుండా సినిమా అన్ని భాషల్లో క్లిక్కవుతుందని ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమా విడుదల విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తుండగా ఇటీవల మళ్ళీ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన పోస్టర్ తో జనవరి 7న రానున్నట్లు తెలియజేశారు.

  English summary
  Jr ntr and ram charan special birthday wishes for ss rajamouli
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X