Tarak Vs Charan : బిగ్ క్లాష్.. ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్.. అసలైన వార్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ పడబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో బిగ్ మల్టీ స్టారర్ ఫిలింగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇద్దరు స్టార్స్ ఉండడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్మురేపింది. ఏకంగా 1250 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన 5వ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల మధ్య స్వల్పపాటి వార్ కూడా కొనసాగింది. ఈ చిత్రంలో తమ హీరోనే గొప్పగా కనిపిస్తారని ఎవరికి వారు అంచనాలను పెంచేసుకున్నారు. దీంతో ఈ బిగ్గెస్ట్ ఫిలిమ్ ను డైరెక్ట్ చేసిన దర్శక ధీరుడు ఎస్ రాజమౌళికి కత్తి మీద సామైంది. అయినప్పటికీ ఇద్దరి హీరోలను బలమైన క్యారెక్టర్రైజేషన్లో చూపించి అభిమానుల నుంచి ప్రశంసలు పొందారు. ముందుగానే అభిమానుల నుంచి ఎలాంటి ఫైట్ జరగకూడదని జక్కన్న వారి ఫ్రెండ్షిప్ ని ముందుకు తీసుకువచ్చి ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Jr Ntr and Ram Charan s Upcoming Movies will going to Clash at Indian Box Office

అయితే ఫ్యాన్స్ లో మాత్రం ఎవరి హీరో వారికి గొప్ప అనే భావన కలిగి ఉండడం సహజమే. ఈ క్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గ్లోబల్ స్టార్స్ గా ఎదిగిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తమ రాబోయే చిత్రాల షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిలిం డ్రాగన్ రూపుదిద్దుకుంటుంది. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో పెద్ది సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 31 డ్రాగన్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ మూడవ వారం నుంచి ఎన్టీఆర్ షూటింగ్ కి హాజరుకానున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ తన రాబోయే చిత్రం పెద్ది సినిమా ను ఇప్పటికే 70% వరకు తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. కాగా పెద్ది సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్టు కూడా రెండు వారాల గ్యాప్ తో ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది.

దీంతో తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారని నిపుణులు అంటున్నారు. బిగ్ స్టార్స్ కావడంతో రెండు వారాల గ్యాప్ కూడా ఒక్కరోజు గ్యాప్ లాంటిదే అని భావిస్తున్నారు. దీంతో వీరి ఓపెనింగ్ డే కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా పెద్ది, డ్రాగన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాస్ అవుతున్నాయని, దీంతో ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ గా పరిస్థితి మారనుందని అంటున్నారు. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడు చూడని జాతర కనిపించడం ఖాయం అని అంటున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X