పెద్దోడు ఇరగదీస్తున్నాడు.. చిన్నోడిపైనే భయం.. ఎస్ఎస్ రాజమౌళి ఎమోషనల్ స్పీచ్
సుప్రసిద్ద వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మాతలుగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం తెల్లవారితే గురువారం. శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27 తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాలభైరవ ఇరగదీస్తున్నాడు..
తెల్లవారితే గురువారం టీజర్, ట్రైలర్ బాగున్నాయి. బయట హీరోలు నటించిన సినిమాల విషయంలో ఆ హీరో బాగా చేశారు. ఆయన బ్రహ్మండంగా చేశారని చెప్పేస్తుంటాం. మా ఇంట్లో పిల్లలు శ్రీ సింహ, కాలభైరవ ఏది చేసిన ఇరగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే మన పిల్లవాళ్లు కావడం వల్ల అలా అనిపిస్తుందా అనే డౌట్ కలుగుతుంది. అయితే వాళ్లపై ఉండే అనుమానాలను ఈ సినిమా చూసి ప్రేక్షకులే తేల్చాలి అంటూ రాజమౌళి అన్నారు.

సింహా మీదే మాకు భయం
మా ఇంట్లో పిల్లల విషయానికి వస్తే కాల భైరవ విషయంలో మాకు ఎలాంటి టెన్షన్ లేదు. వాడు బాగా చేస్తున్నాడు. పాటలు, రీరికార్డింగ్ చేస్తూ ఇరగ గొట్టేస్తున్నాడు. వాడిపై మాకు ఎలాంటి భయం లేదు. మొత్తంగా చిన్నోడు సింహా మీదే మాకు భయం. వాడి గురించి త్వరలోనే మీరు తేలుస్తారనే నమ్మకం ఉంది అంటూ రాజమౌళి చెప్పారు.

కీరవాణి వెంటాడుతున్న డైరెక్టర్లు
ఇక అన్నయ్య కీరవాణి పరిస్థితి చూస్తే కామెడీగా మారింది. చాలా మంది ఫోన్ చేసి సింహా కోసం కథ చేశానని చెబుతున్నారు. అది విని ఆయన కొంత టెన్షన్ పడుతున్నారు. నేను చేసే సినిమాల కథలే వినను. నా కుమారుడి కోసం చేసే కథలు నేను వింటానా అంటూ కీరవాణిగారు సమాధానం ఇస్తున్నారు. అది చూసి మాకు బాగా కామెడీ అనిపిస్తున్నది అని రాజమౌళి సరదగా ఓ విషయాన్ని అభిమానులతో పంచుకొన్నారు.

తెల్లవారితే గురువారం సినిమా బిగ్ హిట్
తెల్లవారితే గురువారం టీజర్, ట్రైలర్ చూస్తే చాలా రిచ్‌గా ఉంది. సాయి గారు లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో చేశారు. సినిమా తప్పకుండా బిగ్ హిట్ అవతుందనే నమ్మకం ఉంది. దర్శకుడు మణికాంత్ గెల్లి తొలి సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. గుడ్ లక్ అంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించాడు.

నటీనటులు
నటీనటులు: శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిశ్రా నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్య ప్రదీప్ తదితరులు
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
రచన: నాగేంద్ర పిల్లా
సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు
మ్యూజిక్: కాల భైరవ
ఎడిటింగ్: సత్య గిడులూరి
బ్యానర్లు: వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్: 2021-03-27


Click it and Unblock the Notifications











