For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైసీపీ నేతపై కాలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. షాకింగ్ ఫొటో వైరల్!

  |

  జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల బీజేపీ ప్రముఖ నేత అమిత్ షాను కలుసుకోవడంతో ఒక్కసారిగా అనేక రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే కేవలం అది క్యాజువల్ మీటింగ్ అని చెప్పినప్పటికీ కూడా ఎవరికివారు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు క్రియేట్ చేస్తున్నారు అని బీజేపీ ప్రముఖులు కూడా మండిపడ్డారు. అయితే ఈ తరుణంలో ఎన్టీఆర్ కు సంబంధించిన మరొక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ నేతపై కాలు పెట్టిన విధానం కూడా హైలెట్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  మొదట్లో అలా..

  మొదట్లో అలా..

  జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున కొన్నిసార్లు ప్రచారాలు కూడా చేశారు. తన తండ్రివెంటే తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో ఒక కార్యకర్త తరహాలోని వర్క్ చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత మరికొన్నాళ్లకు దూరమయ్యాడు. ఏలాంటి సినిమా చేసిన కూడా పార్టీకి సంబంధించిన విషయాలను ప్రస్తావనలోకి తీసుకురావడం లేదు.

   రాజకీయా కోణాలు

  రాజకీయా కోణాలు

  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా హీరోగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజకీయాలకు ఆయన మరింత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. అయితే హఠాత్తుగా ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత లో ఒకరైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలుసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దీని వెనుక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనేది అందరిలో కూడా చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో అలాంటిదేమీ లేదు అని బీజేపీ ప్రముఖులు తెలియజేశారు.

  20 నిమిషాల చర్చలు

  20 నిమిషాల చర్చలు

  జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటించిన విధానానికి మెచ్చుకున్న అమిత్ షా ఆయనను ప్రత్యేకంగా కలుసుకోవాలని ఆకాంక్షతోనే ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేశారని అన్నారు. ఇక కేవలం డిన్నర్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు సినిమా చిత్ర పరిశ్రమ గురించి వారు చర్చించుకున్నట్లుగా బిజెపి కీలక నేతలు వివరణ ఇచ్చారు.

  కొడాలి నాని రియాక్షన్

  కొడాలి నాని రియాక్షన్

  అయితే ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఒకప్పుడు అత్యంత స్నేహితుడిగా ఉన్నటువంటి కొడాలి నాని కూడా ఈ కలయికపై ఊహించిన విధంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ నేతలు కలుసుకోవడం వెనుక రాజకీయ కోణం ఉండవచ్చు అని అతనితో ప్రచారాలు చేయించినా కూడా చేయిస్తారు అని అలా చేస్తే బిజెపికే చాలా లాభం చేకూరుతుందని కూడా కొడాలి నాని స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

  కొడాలి నానిపై కాలు వేసి..

  కొడాలి నానిపై కాలు వేసి..

  అయితే ప్రస్తుతం కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీలు వేరైనా కూడా వీరి మధ్యలో మంచి స్నేహం ఉంది అని అందరికీ తెలిసిందే. అయితే కొడాలి నాని అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో ఫోటో చూస్తే అర్థమవుతొంది. అతనిపై సరదాగా కాలు వేసి మరి ఎన్టీఆర్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఒక స్నేహితుడు తరహాలోనే కొడాలి నాని కూడా క్యాజువల్ గా కనిపించారు. ఇక వారి పక్కనే వల్లభనేని వంశీ కూడా ఉన్నాడు.

  ఆ ఫొటో ఎప్పటిదంటే..

  ఆ ఫొటో ఎప్పటిదంటే..

  ప్రస్తుతం కొడాలి నాని వైసిపి నేతగా కొనసాగుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో కూడా స్నేహం ఎప్పటిలాగే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు చాలా సార్లు కలుసుకున్నారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా మా స్నేహం ఎప్పటికీ అలానే ఉంటుంది అని కూడా అన్నాడు. ఇక ఇప్పుడు ఆది సినిమా షూటింగ్లో సమయంలో తీసిన ఒక ఫోటో వైరల్గా మారిపోయింది.

  English summary
  jr ntr and ycp leader kodali nani vintage friendship photo viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X