Jr NTR ఖరీదైన వాచ్.. అది దొరికితే లైఫ్ సెటిల్.. డెలివరీ చార్జే 25 వేలు!
RRR సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రేజ్ అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ మొట్టమొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుని వారి మార్కెట్ స్థాయిని కూడా పెంచింది. ఇక తదుపరి సినిమాలో కూడా అంతకుమించి అనేలా రాబోతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు లగ్జరీ లైఫ్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇటీవల అతని చేతికి ఉన్న వాచ్ ఫోటో వైరల్ గా మారింది. అది మనకు ఇస్తే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని డెలివరీ చార్జెస్ కూడా ఆరెంజ్ లో ఉండడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు కి వెళితే..
గ్రాండ్ పార్టీ:జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన ఇంట్లోనే కొంతమంది గెస్ట్ లకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ వేడుకకు అమెజాన్ ప్రైమ్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇక అతనితో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ జేమ్స్ ఫారెల్ చాలాసేపు ఈ పార్టీలో ప్రత్యేకంగా చర్చించుకున్నట్లుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి.

దర్శకులు కూడా:అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖ దర్శకులను నిర్మాతలను కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. వారితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి త్రివిక్రమ్ పక్క పక్కనే ఉన్న ఒక ఫోటో కూడా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.
స్టైలిష్ లైఫ్:అయితే పార్టీ ఏదైనా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపించడానికి ఒప్పుకుంటాడు. ఇక అతను ధరించే దుస్తులు అలాగే వేసుకునే వాచ్లు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి అని చాలా సార్లు అర్థమైంది. గతంలోనే ఎన్టీఆర్ ఎన్నో బ్రాండెడ్ వాచ్లను ధరించి నేషనల్ మీడియాను సైతం ఆకర్షించాడు.

ఖరీదైన వాచ్:ఇక రీసెంట్ గా ఆ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన మరొక ఖరీదైన వాచ్ ఫోటో కూడా వైరల్ గా మారింది. దాని ద్వారా దాదాపు 8 కోట్లకు పైగానే ఉంటుందట. రిచార్డ్ మిల్లీ బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ధర 8,24,85,895 రూపాయలట. ఇంత కాస్ట్లీ వాచ్ ను తారక్ చేతికి చూసిన సోషల్ మీడియా ఫాలోవర్స్ దాన్ని మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
డెలివరీ ఛార్జ్:ఇక వాచ్ మీద అయితే సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్క వాచ్ మనకు దొరికితే మాత్రం లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంతేకాకుండా దాని డెలివరీ ఛార్జ్ దాదాపు 25 వేల వరకు ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ కు మాత్రం వాచ్లు అంటే ఎంత ఇష్టమో మరోసారి ఈ విధంగా తెలియజేశాడు అని అంటున్నారు.

బిగ్ యాక్షన్ మూవీ:ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లోనే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. బిగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇక సినిమాను 2024 ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











