Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
NTR30: ఎన్టీఆర్ రోల్‌పై సెన్సేషనల్ లీక్.. హైలైట్ కాబోతున్న సింగిల్ ఫింగర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా పరిచయమైన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగాడు. మధ్యలో కొన్ని పరాజయాలు ఇబ్బంది పెట్టినా.. ఇటీవలి కాలంలో మాత్రం వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ తారక్ ఎదిగిపోయాడు.
Bigg Boss Winner: ఫినాలే వీక్‌లో షాకింగ్ ఓటింగ్.. అతడికే అన్ని ఓట్లా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే!
టాలీవుడ్ ఆల్‌రౌండర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీ ఒకటి. తారక్ ముప్పైవ చిత్రంగా వస్తోన్న ఇది మాత్రం అనుకున్న సమయానికి మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని జోరుగా వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను వెతుకున్నట్లు కూడా వెల్లడించింది. ఆ వెంటనే మ్యూజిక్ సిట్టింగ్స్‌ను కూడా కంప్లీట్ చేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోతున్న ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో తారక్ ఆరు వేళ్లు ఉన్న చేతితో కనిపించబోతున్నాడట. ఆ ఎక్స్‌స్ట్రా ఫింగరే అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారని తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే 'రక్షకుడు' సినిమాలో నాగార్జున నరాలు పొంగినట్లు.. ఎన్టీఆర్ వేలు పలు రకాల సంజ్ఞలు చేస్తుందని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయనే చెప్పాలి.
మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇది వచ్చే జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది.