NTR30: తారక్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ఒక్కడే కానీ ఊహించని విధంగా!
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనా.. తనదైన టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికితోడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఫలితంగా అప్పటి నుంచి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులను కూడా ప్రకటించేశాడు. అందులో టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీ ఒకటి. తన ముప్పైవ చిత్రంగా వస్తోన్న ఇది మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం లొకేషన్లను వెతుకున్నట్లు కూడా వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి సాఫ్ట్‌గా ఉంటుందని తెలిసింది. మరో పాత్ర మాత్రం ఎంతో వైలెంట్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు గెటప్‌ల కోసం తారక్ తన బాడీని కూడా మార్చుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అతడు తీవ్రంగా శ్రమించబోతున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.


Click it and Unblock the Notifications











