Devara Japan Premier Show: దేవర జపాన్ ప్రీమియర్‌కు అనూహ్య స్పందన.. డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. దేవర చిత్రం యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో రిలీజ్‌కు సిద్దమవ్వగా, ఎన్టీఆర్, కొరటాల ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సుమారుగా 400 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో దాదాపు 450 కోట్ల రూపాయలు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 40 కోట్ల గ్రాస్, తమిళనాడులో 11 కోట్ల రూపాయలు, కేరళలో 2.5 కోట్లు, హిందీలో 82 కోట్లు, ఓవర్సీస్‌లో 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

అయితే దేవర సినిమాను జపాన్ భాషలోకి అనువదించి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివ అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా జపాన్ చేరుకొన్న వారిద్దరూ అక్కడ ప్రదర్శించిన ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో చిన్నారులు వేసిన స్టెప్పులకు తారక్ కూడా కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జపాన్‌కు చేరుకొన్న ఎన్టీఆర్, కొరటాల ఆ దేశపు మీడియాతో సమావేశమయ్యారు. ఆ మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడి ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అనంతరం అక్కడి అభిమానులకు ప్రశాంతంగా ఆటోగ్రాఫులు ఇస్తూ.. ఫోటోలు దిగుతూ కనిపించారు. ఎన్టీఆర్‌కు అపూర్వమైన స్వాగతం జపాన్ అభిమానుల నుంచి లభించింది.

జపాన్‌లో మార్చి 24వ తేదీ అంటే సోమవారం ప్రీమియర్ షోను వేశారు. ఈ షోను ప్రదర్శించిన థియేటర్ ఆడియెన్స్‌తో కిక్కిరిసిపోయింది. ఇంతకు ముందు యంగ్ టైగర్ నటించిన RRR సినిమాకు అనూహ్యమైన స్పందన లభించడం తెలిసిందే. ఆ సినిమా తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్‌కు అనూహ్యంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.
జపాన్‌లో దేవర చిత్రం మార్చి 28వ తేదీన భారీగా అత్యధికంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. తాజాగా ప్రీమియర్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందనే అంచనాను వేస్తున్నారు. ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











