ఎన్టీఆర్ బైక్ రైడ్: సెక్యూరిటీ లేకుండా కొడుకుతో ప్రయాణం.. హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ గా ఎదుగుతున్నా కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎప్పటికి ఒకేలా ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద స్థాయి ఎంత పెరిగినా కూడా నేల మీద కూడా కూర్చుంటాడు. సింపుల్ గా ఉండే ఈ హీరో మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం కొడుకుతో ప్రయాణం చేసిన ఒక ఫోటో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేజ్ లలో వైరల్ గా మారింది.

అన్ని రకాల కోణాల్లో
కెరీర్ మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని అందరికి తెలిసిన విషయమే. క్లాసికల్ డ్యాన్సర్ నుంచి ఊర మాస్ వరకు అన్ని రకాల కోణాల్లో అభిమానులను మెప్పించిన తారక్ నటనలో కూడా అభిమానులను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటు ఉంటాడు.

నందమూరి వంశంలో
ఎలాంటి సినిమా చేసినా కూడా తనదైన శైలిలో అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించగల ఈ స్టార్ యాక్టర్ 100కోట్ల మార్కెట్ వరకు వచ్చినా కూడా అదే సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. తాతకు తగ్గ మనవాడిగా నందమూరి వంశంలో అత్యదిక మార్కెట్ ఉన్న నటుడిగా ఎదిగిన తారక్ అంటే అభిమానులు ఏ రేంజ్ లో ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఎక్కువగా మిస్సవ్వకుండా
ఇక ఈ స్టార్ హీరో ఫ్యామిలీ లైఫ్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఇద్దరు కుమారులను ఎక్కువగా మిస్సవ్వకుండా చూసుకుంటాడు. వీలైనంత వరకు ఖాళీ సమయాల్లో ఎక్కువగా వారితోనే టైమ్ స్పెండ్ చేయాలని చూస్తుంటాడు.

చిన్న పిల్లడిలా మారిపోయి
అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు సంబంధించిన ఫొటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఫెస్టివల్ లో వారి ఫొటోలు ఎదో ఒక విధంగా బయటకు వస్తూనే ఉంటాయి. అయితే వారితో కలిస్తే ఎన్టీఆర్ కూడా చిన్న పిల్లడిలా మారిపోయి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు.

కొడుకుతో బైక్ రైడ్..
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఒక కాస్ట్లీ బైక్ పై జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ను ఎక్కించుకొని వెళుతున్నట్లు ఉంది. బహుశా తన కుమారుడు కోరిక మేరకు తారక్ ఈ విధంగా హైదరాబాద్ నగరంలో నాలుగు రౌండ్లు కొట్టి ఉండవచ్చని తెలుస్తోంది. ఇక అభిమానుకు ఆ ఫొటోను చూసి సంబరపడిపోతున్నారు.

రాబోయే సినిమాలు
ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న తారక్ ఆ సినిమా అనంతరం కొరటాల శివతో తన 30వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక ప్రాజెక్టు అనుకుంటున్నట్లు టాక్. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది.


Click it and Unblock the Notifications











