జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. పక్కా ప్లాన్స్‌తో యంగ్ టైగర్, ఫోటో వైరల్
సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయం కావడానికి చాలా మంది సినీ వారసులు రెడీగా ఉన్నారు. అయితే నెపోటిజమ్ విమర్శలతో అందులో కొందరికి అప్పుడే తెలియని ఆందోళన మొదలైంది. ఇక విమర్శలు కామన్ అనుకోని ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది టాలెంటెడ్ వారసులు సొంతంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక త్వరలో ఎన్టీఆర్ బామ్మర్ది కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఏకంగా పాన్ ఇండియా సినిమాలను..
నందమూరి వంశం నుంచి సినీ నటులు ఏ స్థాయిలో ఎంట్రీ ఇచ్చారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అందులో అందరికంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. బాలయ్య కంటే కూడా హై రేంజ్ లో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ ఏకంగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

ఎన్టీఆర్ తో చర్చలు..
అసలు మ్యాటర్ లోకి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ మామ నార్నే శ్రీనివాస్ రావ్ తన కొడుకును హీరోగా లాంచ్ చేసేందుకు ఇప్పటికే ఒక ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఈ విషయంపై గత ఏడాది నుంచే చర్చలు జరుపుతున్నారాట.

బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఫినిష్..
అయితే ఎన్టీఆర్ బామ్మర్ది టాలీవుడ్ ఎంట్రీపై ఏ విధంగా స్పంధించారో తెలియదు గాని శ్రీనివాస్ రావ్ మాత్రం కొడుకును దాదాపు బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఒక చిన్న దర్శకుడే నితిన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. ఇంతవరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

స్మార్ట్ గానే ఉన్నాడు..
అయితే రెగ్యులర్ గా నితిన్ తన బావకు టచ్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక అతనికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే స్మార్ట్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక నటనకు సంబంధించిన కోర్స్ కూడా పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











