twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Amigos: ఎన్టీఆర్ సీక్రెట్ లీక్ చేసిన కల్యాణ్ రామ్.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే

    |

    నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. విజయాలను మాత్రం అంతగా రాబట్టలేకపోయాడు. కానీ, ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'బింబిసార' అనే సినిమాతో కల్యాణ్ రామ్ వచ్చాడు. దీనికి భారీ రెస్పాన్స్ దక్కడంతో.. ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

    పొట్టి డ్రెస్‌లో గీత దాటేసిన తెలుగు పిల్ల: ఓర్నాయనో ఆ ఫోజులేంటి సామీ!పొట్టి డ్రెస్‌లో గీత దాటేసిన తెలుగు పిల్ల: ఓర్నాయనో ఆ ఫోజులేంటి సామీ!

    'బింబిసార' ఫలితంతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి కల్యాణ్ రామ్.. ఇప్పుడు 'అమిగోస్' అనే మరో ప్రయోగాత్మక సినిమాను చేశాడు. రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అతడు మూడు పాత్రల్లో నటించాడు. దీంతో క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది.

    Jr NTR Chief Guest for Amigos Pre Release Event

    నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న 'అమిగోస్' మూవీ ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నందమూరి కల్యాణ్ రామ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా వస్తున్నట్లు కూడా లీక్ చేశాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటోన్నారు. ఇక, ఈ ఈవెంట్ సమాచారం ఈరోజు రానుందని తెలిసింది.

    వాటి సైజ్ పెంచుకోమన్నారు.. పెద్దగా కనిపించేందుకు అవి వాడేదాన్ని: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలువాటి సైజ్ పెంచుకోమన్నారు.. పెద్దగా కనిపించేందుకు అవి వాడేదాన్ని: సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    'అమిగోస్' మూవీలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు చేస్తున్నారు.

    English summary
    Nandamuri Kalyan Ram Did Amigos Movie Under Rajendra Reddy Direction. Jr NTR Chief To Attend for This Movie Pre Release Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X