ఒకే వేదికపైకి నందమూరి హీరోలు: సాలిడ్‌గా ప్లాన్ చేస్తోన్న బింబిసారా టీమ్

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు. వీళ్లిద్దరి తర్వాత తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతోన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలను మాత్రమే అందుకున్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో అతడు పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ సత్ఫలితాలను సొంతం చేసుకుంటున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం 'బింబిసారా' అనే సినిమాను పూర్తి చేసుకున్నాడు. మల్లిడి వశిష్ట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. వాస్తవానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల బ్రేక్‌లు వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాను శరవేగంగా జరుపుతూ వచ్చారు. ఇలా ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అంతేకాదు, ఇప్పటికే దీని నుంచి కొన్ని అప్‌డేట్లను కూడా వదిలారు.

యంగ్ డైరెక్టర్‌ రూపకల్పనలో కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసారా' సినిమాను ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమా ట్రైలర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. వీటికి నందమూరి అభిమానులే కాకుండా.. అన్ని వర్గాల వాళ్ల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. ఫలితంగా ఇవన్నీ ట్రెండింగ్ అయిపోయాయి. అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

Jr NTR Chief Guest for Bimbisara Pre Release Event

టైం ట్రావెల్ కథతో రూపొందిన 'బింబిసారా' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ జూలై 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. దీన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్వహించబోతున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్నాడట. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతోంది.

మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ మూవీనే 'బింబిసారా'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X