RRR: ఎన్టీఆర్ చేతికి ఖరీదైన వాచ్.. ధర ఎంత తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి నుంచి బాహుబలి అనంతరం వస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ తో బిజీగా ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఒక ఖరీదైన వాచ్ తో కనిపించాడు.

ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్
జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కార్లు బైక్స్ అంటే తారక్ కు చాలా ఇష్టం. మార్కెట్ లోకి కొత్త తరహా బైక్స్ కార్లు వస్తే వాటిపై ఒక లుక్ వేయకుండా ఉండడు. ముఖ్యంగా కార్లు వస్తే ఒక టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే. కారు నచ్చితే విదేశీ మోడల్ అయినా సరే తారక్ స్వదేశానికి వచ్చేలా ఆర్డర్ కూడా చేయించుకుంటాడు.

కళ్యాణ్ రామ్ ఖరీదైన కానుక
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే తారక్ కు వాచ్ లు అంటే కూడా ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా తారక్ కోసం వారి సన్నిహితులు కూడా ఖరీదైన వాచ్ లను కానుకగా అందిస్తూ ఉంటారు. ఇక తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా గతంలో కూడా విలువైన ఒక వాచ్ ను కూడా కానుకగా ఇచ్చాడట. అది దాదాపు రూ. 1 కోటి ఖరీదు చేసిన లగ్జరీ వాచ్ అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కి అరుదైన మరియు విలాసవంతమైన వాచీలంటే చాలా ఇష్టమట.

లగ్జరీ వాచ్
రిచర్డ్ మిల్లే RM 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ అత్యంత ఖరీదైన వాచ్ అని ప్రత్యేకంగా చెప్పనవరంలేదు లేదు.
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ మోడల్ వాచ్ విలువ కోట్లల్లోనే ఉంటుందట. రోజ్ గోల్డ్ లోటస్ F1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ ధర గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తారక్ ప్రస్తుతం వేసుకున్న ఆ వాచ్ ధరకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4కోట్ల రూపాయల వాచ్
ఇక ఆ వాచ్ ధర 39,932,395 రూపాయలని తెలుస్తోంది. అంటే ఆర్డర్ చేసిన తరువాత అన్ని రకాల ట్యాక్స్ లను కలుపుకొని దాదాపు రూ.4 వరకు దీని ధర ఉంటుందన్నమాట. తారక్ ఈ రేంజ్ లో కొనుగోలు చేశాడు అంటే తనకి చేతి గడియారాల మీద ఎంత నమ్మకం ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ట్రైలర్ పై భారీ రెస్పాన్స్
ఇక RRR సినిమా జనవరి 7వ వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి హాలిడేస్ ను ఎలాగైనా డామినేట్ చేసి భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవాలని రాజమౌళి యూనిట్ గట్టిగానే ప్లాన్ చేసింది. ఇక ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో అజయ్ దేవగన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











