చిరంజీవి, రాంచరణ్ సరైన వారు కాదా? ఎన్టీఆర్ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఫైర్
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోలు అంతా ఇపుడు పలు బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలనే చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో పలు సినిమాలు హిట్ అవుతున్నాయి మరికొన్ని ఫట్టవుతున్నాయి. ఇలా టాలీవుడ్ లో గడిచిన కొన్నేళ్లలోనే మన స్టార్స్ నుంచి భారీ ఇచ్చిన సినిమాలూ చూసాం అలాగే దారుణమైన నష్టాలు వచ్చిన సినిమాలు కూడా చూడాల్సి వచ్చింది.
కాగా ఈ సమయంలో ఆ సినిమా తాలూకా ఫలితాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా కీలకంగా మారుతుంది. ఇలా మన తెలుగులో ఎంతో క్రేజ్ తో వచ్చిన సినిమా కోసం ఇప్పుడు మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆ సినిమానే మెగాస్టార్ చిరంజీవి, అలాగే తన నట వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా అని చెప్పాలి.

ఇది మెగా అభిమానులకి ఒక గుర్తుండిపోయే సినిమాగా వస్తుంది అని అభిమానులు అనుకుంటే మరో రకంగా గుర్తుండిపోయే సినిమాగా దర్శకుడు కొరటాల శివ అందించాడు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత చిరంజీవి చేసిన స్టేట్మెంట్ కూడా కాక రేపింది. సినిమా విషయంలో నా తప్పేమి లేదని దర్శకుడు ఏం చెప్తే అదే చేసాం సో తన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అంటూ చేసిన కామెంట్స్ ఇతర హీరోల అభిమానుల్లో నెగిటివ్ గా మారాయి.
అయితే ఈ ఇన్సిడెంట్ పైనే లేటెస్ట్ గా మరో బిగ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఇప్పుడు ఇదే కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర అనే భారీ సినిమా చేసాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. కాగా కొరటాల గత ఫెయిల్యూర్ (ఆచార్య) కోసమే మాట్లాడుతూ కొరటాల సరైన సినిమా సరైన మనుషులతో చేయాల్సింది కానీ అప్పుడు కుదరలేదు.

ఇప్పుడు దేవర కి కుదిరింది అంటూ ఇన్ డైరెక్ట్ గా రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరి విషయంలో కూడా ఈ ఊహించని స్టేట్మెంట్ ని తారక్ చేయడం షాకింగ్ గా మారింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఈ కామెంట్స్ ని తారక్ చిరు చరణ్ ల కోసమే అన్నాడు అంటూ చాలా మంది పర్టిక్యులర్ గా కూడా వైరల్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఈ రకంగా కామెంట్ చేయడంపై మెగా అభిమానులు కూడా కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి, చరణ్ ల పేర్లు ఎత్తకుండానే ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఇపుడు ఆడియెన్స్ లో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. అలాగే ఈ ఇద్దరూ కూడా ఈ చిత్రంతోనే తెలుగు డెబ్యూ ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











