ముందుకు వచ్చిన యంగ్ టైగర్.. ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు అండగా ఎన్టీఆర్
కరోనా దెబ్బకు దేశం మొత్తం వణికిపోతోంది. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఏప్రిల్ 14 వరకు ఇదే పద్దతి కొనసాగుతుందని దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పేదలు, పేద కళాకారులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.
కరోనాను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు గానూ ముఖ్యమంత్రి సహాయ నిధికి సెలెబ్రిటీలంతా విరాళాన్ని ప్రకటిస్తున్నారు. యంగ్ హీరో నితిన్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ చేరుతున్నారు. తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు.

తాజాగా యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా చేరిపోయాడు. ఇలాంటి విపత్కర సమయంలో ముందుకు వచ్చిన ఎన్టీఆర్ 75లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షలు, సినీ శ్రామికుల సహాయార్థం రూ. 25 లక్షలను ప్రకటించాడు. ఇప్పటికే చిరంజీవి తెలుగు సినీ శ్రామికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











