Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా మొట్టమొదటి హీరో మీరే.. జై బాలయ్య అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి నట సింహం బాలకృష్ణ 60వ పుట్టినరోజు కావడంతో నిన్నటి నుంచే అభిమానుల్లో జోష్ మొదలైంది. ఇక ఉదయం నుంచి అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినీ తారలు కూడా ఒక్కొక్కరుగా బాలయ్యకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఎమోషనల్ ట్వీట్ తో బాబాయ్ పై తన అభిమానాన్ని చూపించుకున్నాడు.
సెలబ్రెటీస్ విషెస్..
నందమూరి బాలకృష్ణ బర్త్ డే ట్యాగ్ ని సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా ఆభిమానులు ఇంటర్నెట్ లో చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. దానికి తోడు సెలబ్రెటీస్ కూడా బాలకృష్ణ గురించి ఎదో ఒక ట్వీట్ చేస్తూ బలయ్యపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక అంధరికంటే స్పెషల్ గా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ వారి ట్వీట్స్ తో బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
|
ఎన్టీఆర్ ట్వీట్..
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ... చివరలో జై బాలయ్య అని ట్వీట్ చేశాడు తారక్.
|
కళ్యాణ్ రామ్ విషెస్..
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ కళ్యాణ్ రామ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Recommended Video
మల్టీస్టారర్ సినిమాకు రెడీ..
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కూడా బాలకృష్ణ ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తే బావుంటుంది అనే ప్రశ్నకు ఇటీవల బాలకృష్ణ స్పందించారు. తప్పకుండా వాళ్ళతో సినిమాలు చేయడానికి సిద్ధమే అంటూ.. అయితే అందుకు సరైన కథ దొరికితే బావుంటుందని అన్నారు. కేవలం కమర్షియల్ గానే కాకుండా సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు సందేశం కూడా ఉండేలా కథ సిద్ధమైతే తప్పకుండా చేస్తామని అన్నారు.