For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డిప్రెషన్ లో ఉన్న సమయంలో రాజమౌళి సపోర్ట్.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

  |

  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ కూడా చాలా గట్టిగానే జరుగుతున్నాయి. ఇక వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న హీరోలు కూడా వారి అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి చేసిన సపోర్టును కేవలం సినిమా పరంగానే కాదు అంటూ జీవితంలో కూడా అతను తనకు చాలా ముఖ్యమని ఫుల్ గా ఫీల్ అయ్యాడు

  RRR Moivie : Ram Charan Is Calm But Jr NTR Is A Tsunami - SS Rajamouli | Filmibeat Telugu
   పోటాపోటీగా..

  పోటాపోటీగా..

  త్రిబుల్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. మొదటిసారి ఈ ఇద్దరు కూడా రెండు విభిన్నమైన ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతున్నారు. ఇద్దరు కూడా పోటాపోటీగా సినిమాల్లో నటించినట్లు ఇప్పటికే ట్రైలర్ తో క్లారిటీ అయితే వచ్చేసింది.

  అన్ని భాషల్లోనూ..

  అన్ని భాషల్లోనూ..

  డివివి దానయ్య ఈ సినిమాను దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లుగా ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చాలా బిజీ బిజీగా అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇక రాజమౌళి తో పాటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా స్నేహంగా కనిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పాలి.

  డిప్రెషన్ లో తారక్

  డిప్రెషన్ లో తారక్


  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలోని ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా రాజమౌళికి తనకున్న అనుబంధం గురించి కూడా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయారు. 17 ఏళ్ల వయసులో తాను సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనట్లు చెప్పిన తారక మొదట్లో సక్సెస్ లు చాలానే వచ్చాయని అయితే కొన్నాళ్లకు వరుస పరాజయాలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్లు తెలియజేశాడు.

  స్నేహితుడి కంటే ఎక్కువ

  స్నేహితుడి కంటే ఎక్కువ

  తను డిప్రెషన్లో ఉన్న సమయంలోనే రాజమౌళి సపోర్ట్ ఇచ్చిన విధానం అంతా ఇంతా కాదు అని వరుసగా డిజాస్టర్స్ ఎదురైనప్పుడు యమదొంగ సినిమాను తెరపైకి తీసుకు వచ్చి మళ్లీ తనకు కెరీర్ సెట్ అయ్యేలా చేసాడు అని ఆ విషయంలో అతనికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా తెలియజేశాడు. రాజమౌళి కేవలం తనకు స్నేహితుడు మాత్రమే కాదని అంతకంటే ఎక్కువ అంటూ తన జీవితంలో మర్చిపోలేని విజయాలను అందించాడని వివరణ ఇచ్చాడు.

   ఒక నటుడిగా సరి కొత్తగా..

  ఒక నటుడిగా సరి కొత్తగా..


  ఇప్పటి వరకూ తన సినిమా జీవితం లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ RRR మాత్రం చాలా ప్రత్యేకం అని ఇందులో నన్ను నేను ఒక నటుడిగా సరి కొత్తగా చూసుకున్నట్లు తెలియజేశాడు. తప్పకుండా ఈ సినిమా మెగా నందమూరి అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగిస్తుందని అంచనాలకు తగినట్లుగానే రాజమౌళి సినిమాలో తెరపైకి తెచ్చినట్లు వివరణ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్ ను ఎలా ముందుకు తీసుకు వెళతాడో చూడాలి.

  English summary
  Jr ntr emotonal comments on Director Ss rajamouli,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X