Devara : దేవర చూస్తూ ఈలలు, కేకలు.. అంతలోనే కుప్పకూలిన ఎన్టీఆర్ అభిమాని

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర పోషించిన దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో అభిమానులు గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్లకు పోటెత్తారు. అయితే అక్కడక్కడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుండటం కలకలం రేపుతోంది.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ , నందమూరి కళ్యాణ్ రామ్‌లు దేవర సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ఈ సినిమా దుమ్మురేపింది. ఆంధ్రా, నైజాం, సీడెడ్, ఓవర్సీస్‌లో దేవర థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ స్థాయిలో ధర పలికిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Jr ntr fan died in theater while watching devara movie in Kadapa here s the details

రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను ఓ రేంజ్‌లో నిర్వహించారు. సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, కొరటాల, సైఫ్, జాన్వీలు బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లోనూ చిత్ర యూనిట్ పాల్గొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావించి సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పోటెత్తగా.. వేదిక, ఏర్పాట్లు ఏ మూలకు సరిపోలేదు. ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు ఫర్నీచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పరిణామాలతో ప్రీ రిలీజ్ నిర్వహించడం కష్టమని నోవాటెల్ సిబ్బంది, నిర్వాహకులు భావించి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ స్వయంగా వీడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 27న కలుద్దామని చెప్పారు.

తీరా రిలీజ్ రోజు రానే వచ్చింది. గురువారం అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే దేవర ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ల వద్ద కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేవర రిలీజ్ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్‌కి మంటలు అంటుకున్నాయి. వందలాది మంది అభిమానులు చూస్తుండగానే కటౌట్ దగ్ధమైంది.

Jr ntr fan died in theater while watching devara movie in Kadapa here s the details

మరో ఘటనలో కడపలో దేవర సినిమా చూస్తున్న మస్తాన్ అనే ఎన్టీఆర్ అభిమాని గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి వ్యక్తులు ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. మృతుడిని సీకే దిన్నె మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు. అప్పటి వరకు తమతో కలిసి సినిమా చూసిన మస్తాన్ మరణంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు.

More from Filmibeat

Read more about: koratala siva devara jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X