Devara : కొరటాల.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా? .. దేవరపై ఫ్యాన్స్ ఫైర్!!
ఇటీవలి కాలంలో సినిమాలను పార్ట్ 1, పార్ట్ 2 అంటూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని ఒక భాగంలో చెప్పలేకపోతే ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. దీనికి తోడు సినిమా నిడివి , బడ్జెట్ పెరిగిపోతుండటం, నష్టాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మాతలకు కూడా ఈ ఫార్మూలా లాభసాటిగా మారింది. తద్వారా రెండు పార్ట్‌లకు థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా పలువురు నిర్మాతలు ఒడ్డునపడుతున్నారు. అయితే పార్ట్ 2పై అంచనాలను పెంచేందుకు, ఈ మూవీకి హైప్ తగ్గకుండా ఉండేందుకు దర్శకుడు మొదటి భాగంలో కొన్ని ట్విస్టులు ఇస్తాడు. ఇది చాలా వరకు బాగానే వర్కవుట్ అయ్యింది. ఇదే సూత్రాన్ని రీసెంట్‌గా రిలీజైన దేవరలోనూ వాడారు.. ఆ వివరాల్లోకి వెళితే..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క నటించిన బాహుబలి సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు భాగాలుగా ఈ సినిమాను తీయాలని ముందే డిసైడ్ అయిన మేకర్స్ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పార్ట్ 1లో పరిచయ కార్యక్రమాలు, పోరాట సన్నివేశాలు పెట్టిన రాజమౌళి .. బాహుబలి ది బిగినింగ్ చివరిలో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. రాజకుటుంబానికి నమ్మకస్తుడు, హీరోని కన్నబిడ్డలా చూసుకునే కట్టప్పతో అమరేంద్ర బాహుబలికి వెన్నుపోటు పొడిపిస్తాడు.

దీంతో అసలు బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడంటూ , పార్ట్2 కోసం జనాలు వెర్రీగా ఎదురుచూసేలా చేశాడు జక్కన్న. వై కట్టప్ప కిల్ బాహుబలి అంటూ కొన్నేళ్ల పాటు సోషల్ మీడియాలో డిస్కషన్ నడిచింది. దీనిపై ఎన్నో మీమ్స్, స్పూఫ్‌లు కూడా వచ్చాయి. ఇదంతా బాహుబలి 2కి బోల్డెంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఒకే ఒక్క సీన్‌తో రాజమౌళి వేసిన ఎత్తు బ్రహ్మాండంగా వర్కవుటై నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ఇదిలాఉండగా.. కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలు పోషించిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్‌తో ఎన్టీఆర్ కెరీర్‌లోయే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే దేవర చూసిన తర్వాత ప్రేక్షకులకు చాలా డౌట్లు వచ్చాయి. ఏ నలుగురు కలిసినా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వాటి గురించి ఒకసారి చూస్తే :

1. దేవర సినిమా స్టార్ట్ అయ్యాక అజయ్ పోలీస్ సిబ్బందితో ఎంక్వయిరీ చేసే పాత్ర పేరు దేవ.. దేవరని కనిపెట్టడం కోసం వచ్చి దేవర కథ వింటాడు. ఇంతకీ దేవ ఎవరు..?
2. సినిమా మొదట్లో మురగ చనిపోడని చెప్పారు.. మరి ఎలా చనిపోయాడు?
3. దేవర మద్యం మత్తు ఫైట్‌లో అందరినీ చంపుతాడు. కానీ దేవర ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, అక్కడికి తన కొడుకు వర ఎలా వచ్చాడు?
4. దేవర తన గ్రామస్తుల్ని గాయపరిచి భయపెట్టాడే తప్ప ఎవరినీ చంపలేదు, మరి కుంజర ఎలా చనిపోయాడు?
5. నీటి అడుగున ఉన్న అస్థిపంజరాలు వాళ్ల ఊరివాళ్లవి కానప్పుడు ఎవరివి?
6. దేవర చనిపోయాడని ప్రకాష్ రాజ్‌కి ఎలా తెలుసు. అన్నీ తెలిసి తాను మౌనంగా ఎందుకు ఉండిపోయాడు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథ చెప్పడానికే ఎందుకు పరిమితమైంది?
దేవర చూసొచ్చిన వారికి ఈ డౌట్లు వస్తుండటంతో వారు సమాధానాల కోసం ఇలా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. పైన ప్రస్తావించినవి వీటిలో కొన్ని మాత్రమే. మరి వీటన్నింటికి ఆన్సర్ తెలియాలంటే పార్ట్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











