ఒకే ఫ్రేమ్‌లో చరణ్ - ఎన్టీఆర్ ... కొట్టుకుంటున్న హీరోల ఫ్యాన్స్, దాని కోసమేనా?

ఇపుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోల జాబితా చూస్తే వారిలో దాదాపు మన తెలుగు సినిమాకి చెందిన హీరోలే అధికంగా కనిపిస్తారని చెప్పాలి. కాగా ఈ హీరోస్‌లో సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్ (RRR) హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు కూడా ఉన్నారు. కాగా ఈ సినిమాకి ముందే రామ్ చరణ్ హిందీ ఆడియెన్స్‌ని తన జంజీర్‌తో పలకరించడం అక్కడ డిజాస్టర్ కొట్టడం కూడా అయ్యింది.

కానీ అప్పుడు జంజీర్‌కి విమర్శించిన ప్రతీ ఒక్కరితో మళ్ళీ RRR సినిమాతో తన గురించి మాట్లాడేలా చేసుకున్నాడు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ సినిమా విషయంలో మెయిన్ హీరో ఎవరు అనేది ఇప్పటికీ ఇద్దరి హీరోల నడుమ రచ్చ నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ సినిమాలో క్లియర్ కట్ గా రామ్ చరణ్ విషయంలోనే ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు అని సినిమా కూడా తన కోణం లోనే ఉంటుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళిపై నిందలు వేసింది.

jr ntr fans shows their insecurity on ram charan again

కాగా అప్పటి నుంచి రామ్ చరణ్ అంటే ఎన్టీఆర్ అభిమానుల్లో ఎక్కడో చిన్న ఈర్ష్య కూడా ఏర్పడి ఉండొచ్చు కానీ ఇపుడు అది నిజంగానే ఉంది అని క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని రామ్ చరణ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే టాగ్స్ ఉండేవి అని అందరికీ తెలిసిందే. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టాగ్ వచ్చింది

అలాగే రామ్ చరణ్ కి RRR తో వచ్చిన గ్లోబల్ ఫేమ్ తో మెగాపవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అనే టాగ్ ఫిక్స్ అయ్యింది. అఫీషియల్ గా ఎన్టీఆర్‌కి "దేవర" సినిమాకి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎలా పడిందో.. అలానే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి గాను గ్లోబల్ స్టార్ అని మేకర్స్ వేస్తున్నారు. తన తదుపరి సినిమాకి కూడా ఇదే టాగ్ ని మేకర్స్ కొనసాగిస్తారనడంలో సందేహం అక్కర్లేదు.

అయితే వీటికి ముందు ఆ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టాగ్ కోసం సోషల్ మీడియాలో ఇద్దరి హీరోస్ నడుమ మంచి రచ్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాకి అఫీషియల్‌గా ఆ టాగ్‌ని పెట్టుకొనేసరికి ఎలానో చరణ్‌కి గ్లోబల్ ఫేమ్ వచ్చిందని గ్లోబల్ స్టార్ టాగ్‌ని వీరు ఫిక్స్ అయ్యారు.

రీసెంట్ గానే చరణ్, ఎన్టీఆర్‌లు కలిసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలోకి వస్తే ఇది ఆనందించాల్సిన విషయమే . కానీ ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఇచ్చి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కి దారి తీసింది.

కానీ ఇందులో వారి హీరోకి ఒక టాగ్ పెట్టుకుని చరణ్ కి పాత టాగ్ నే పెట్టి పోస్టింగులు చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. ఎలాగో ఇద్దరు హీరోలు కొత్త సినిమాలతో మూవ్ ఆన్ అయ్యిపోయారు కానీ వారి ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఇలాంటి విషయాల దగ్గరే ఆగిపోయారు అని విశ్లేషకులు మండిపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X