ఎన్టీఆర్ ఫ్యాన్స్ Vs అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్.. బూతులతో రచ్చ, ఇదేం ఖర్మ రా బాబు!

హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి ఇప్పుడే కాదు. అప్పట్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య కూడా చిన్నాచితక గొడవలు జరుగుతూ ఉండేవి. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని వాదించుకోవడం ఆ తర్వాత కలిసిపోవడం అనేది కామన్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయాక ఫ్యాన్ వార్స్ కూడా సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ గా మారిపోయాయి. తాజాగా ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మొదలైన రగడ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేదాకా వెళ్ళింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

పోటాపోటీగా ఎన్టీఆర్ - అల్లు అర్జున్

పోటాపోటీగా ఎన్టీఆర్ - అల్లు అర్జున్


నిజానికి చాలా విషయాల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పోటీ పడుతూ ఉంటారు. ఇద్దరూ ఒకే వయసులో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇద్దరూ డాన్సులు కూడా అద్భుతంగా చేస్తారు. ఇద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉండడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు మా వోడు గొప్పంటే మా వోడు గొప్పని ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉంటారు. ఇక ఎక్కడ మొదలైందో ఎందుకు మొదలయిందో తెలియదు కానీ అనూహ్యంగా ఇప్పుడు ఇద్దరు ఫాన్స్ మధ్య రగడ మొదలైంది.

మొదలెట్టిన బన్నీ ఫ్యాన్స్

మొదలెట్టిన బన్నీ ఫ్యాన్స్

మా హీరో తోపు అంటే మా హీరో తోపు అనుకుంటూ మరో హీరోను డి గ్రేడ్ చేసేందుకు సాధారణంగా ఇక్కడ వాడలేని బూతులతో విరుచుకుపడుతున్నారు. దర్శక నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తాడని, తనతోనే సినిమాలు తీయాలని ఒత్తిడి చేస్తాడంటూ అల్లు ఫ్యాన్స్ #CharacterLessPigNTR అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. BLACKMAIL PIG NTR అంటూ బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్

రంగంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఇక ఇదంతా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి అల్లు అర్జున్ పరువుతీస్తున్నారు. #InsecureFoxAlluArjun అంటూ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు మొదలైంది అనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ రావడం లేదు.

ప్రశాంత్ నీల్ కారణమా?

ప్రశాంత్ నీల్ కారణమా?

అయితే నిజానికి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటించక మునుపే ఆయన అల్లు అర్జున్ తో ఒక సారి సమావేశం అయ్యాడు. ఆయన గీతా ఆర్ట్స్ కి వెళ్లి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారాయి. దీంతో అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఖాయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావించారు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్యాన్ ఇండియా లెవల్లో ఉంటుంది అని ఆనందపడ్డారు..

బరితెగించి మరీ బూతులు తిట్టుకుంటూ

బరితెగించి మరీ బూతులు తిట్టుకుంటూ


ఆ ఆనందం ఎన్నో రోజులు నిల్వ కుండానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కూడా ప్రకటన వచ్చింది. బహుశా దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఇద్దరి అభిమానుల మధ్య రగడ మొదలైన ఉండొచ్చని భావిస్తున్నారు.. అయితే మేము, మేము బాగానే ఉంటాము, మీరు కూడా కలిసి ఉండాలని హీరోలు ఎన్ని సార్లు చెబుతున్నా ఇలా అభిమానులు బరితెగించి మరీ బూతులు తిట్టుకుంటూ తమ అభిమాన హీరోలకు కూడా చెడ్డపేరు తీసుకువస్తున్నారు అనడంలో సందేహం లేదు.

Recommended Video

Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
లైన్ లోకి శ్రీ రెడ్డి

లైన్ లోకి శ్రీ రెడ్డి

ఇక ఈ గొడవలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ రెడ్డి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున వకాల్తా పుచ్చుకున్న ఈ భామ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు అంటూ కామెంట్ చేసింది.. మొన్ననే మహేష్ ఫాన్స్ తో ఓడిపోయారు,ని మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పోటీపడి ఓడిపోతారు అంటూ ఆమె కామెంట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X