Taraka Ratna: మీడియా ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. తారకరత్న ఆరోగ్యం గురించి ఏమన్నారంటే..

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతిక్షణం నందమూరి కుటుంబ సభ్యులు మీడియాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్డియక్ అరెస్టుతో ఆసుపత్రిలో చేరిన నందమూరి తారకరత్న వివిధ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని కూడా అభిమానులతో పాటు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి తారకరత్న ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

హాస్పిటల్ లోనే బాలకృష్ణ..

హాస్పిటల్ లోనే బాలకృష్ణ..

తారకరత్న ఆసుపత్రిలో చేరాడు అనగానే అందరి కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దకు చేరుకుని ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ముందుగా బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత బెంగళూరు హస్పటల్ కు కూడా వెళ్లారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుగానే నందమూరి బాలకృష్ణ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది.

బెంగుళూరుకు ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి

ఇక నందమూరి తారకరత్న పరిస్థితి క్రిటికల్ గా మారుతుంది అని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంకా కొన్ని గంటలు గడిస్తే గాని పరిస్థితి పై క్లారిటీ ఇవ్వలేము అని తెలియజేశారు. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు చాలావరకు బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా ప్రత్యేకంగా ఫ్లైట్లో బెంగళూరుకు చేరుకున్నారు.

Jr ఎన్టీఆర్ వివరణ

Jr ఎన్టీఆర్ వివరణ

ఇక నందమూరి తారకరత్నను హాస్పిటల్ లో చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న పోరాడుతున్నాడు అని ఆయన చికిత్సకు కూడా స్పందిస్తున్నారు అని వైద్యులు సైతం మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా తెలియజేశాడు. ఇక తారకరత్న పరిస్థితి కాస్త క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారు అని ఇప్పుడే చెప్పలేము అని త్వరలోనే ఆయన కోలుకుంటారు అని అని జూనియర్ ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

చికిత్సకి స్పందిస్తున్నారు అంటూ..

చికిత్సకి స్పందిస్తున్నారు అంటూ..

అలాగే తారకరత్న ఆత్మబలం మనోబలం అలాగే అభిమానుల ఆశీర్వాదం కూడా తోడుగా ఉంటాయని, ముఖ్యంగా తాత గారి ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకోవాలని, ఈ పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడి వస్తారు అని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇక తారకరత్న కి ఎక్మో అమర్చలేదు అని చికిత్సకి స్పందిస్తున్నారు అని కూడా ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.

శివరాజ్ కుమార్ క్లారిటీ

శివరాజ్ కుమార్ క్లారిటీ

ఇక తారకరత్నకు మళ్ళీ హార్ట్ ఎటాక్ కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని స్టంట్ అయితే వేయలేదు అని ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక బాలయ్యకు మంచి మిత్రుడైన శివరాజ్ కుమార్ కూడా బెంగుళూరు NH హాస్పిటల్ కు చేరుకున్నారు. అలాగే తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు అని తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది అని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా మీడియాకు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X