2024 AP elections: జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌కు దెబ్బ.. వెనుకంజలో ఇద్దరు వైసీపీ బడా నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభం అయింది. ఇందులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. ఈ కౌంటింగ్‌లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికే ఆధిక్యం కనిపించింది. ఆ వెంటనే ఈవీఎంల ఓటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ లెక్కింపు కూడా రంజుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అందులోనూ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ఇద్దరికీ బిగ్ షాక్ తగిలింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను సైతం దాటేసింది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి అడుగులు వేస్తోంది. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు.

మరీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా వెనుకంజలో ఉన్నట్లు తాజాగా తెలిసింది. గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొడాలి నానిపై, టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు.

ఇదిలా ఉండగా.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమకే ఓట్లు వేస్తారని, వేయాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ కామెంట్లు చేశారు. అంతేకాదు, నందమూరి ఫ్యామిలీపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్లకే మద్దతు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫలితం మాత్రం వేరేగా ఉండడంతో ఈ ఇద్దరు బడా నేతలు హాట్ టాపిక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











