జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమోషన్.. అలా పిలిచి చూడండి ఏం జరుగుతుందో అంటూ తారక్ ఝలక్
అభిమానులకు యంగ్ టైగర్‌గా, తారక్‌గా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ శనివారం జరిగిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ చివర్లో మీ రామారావు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. గతంలో ఎప్పుడూ మీ రామారావు అంటూ పలికిన సందర్భాలు లేవు. దాంతో మీడియా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ... ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్ లభించి రామారావుగా మారారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
చిన్నతనం నుంచి మా అమ్మ ఓ పేరుతో పిలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత నా భార్య ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంది. నా పిల్లలు నాన్న అని పిలుస్తారు. నేను పలుకుతున్నాను. నన్ను జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను. తారక్ అని పిలిచిన పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలకుతాను. అలా పిలవండి.. ఇలా పిలవండి అంటూ అడగను. ఎలా పిలిచినా ప్రేమతో ఏ పేరుతో పిలిచినా పలకడం గ్యారెంటీ అని అన్నారు.

ఇక గతంలో నాగార్జున, చిరంజీవి హోస్టుగా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరుడు అనే పేరుతో రియాలిటీ గేమ్ షో జెమినీ టెలివిజన్‌లో ప్రారంభం కానున్నది. ఈ షోకు సంబంధించిన ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన లభిస్తున్నది.
ఇక ఎన్టీఆర్ నటిస్తున్న RRR చిత్రం శరవేగంగా షూటింగు పూర్తి చేసుకొనేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











