NTR30: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ స్టార్ హీరో ఈ మధ్య కాలంలో 'టెంపర్' నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని యమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. అలాగే, కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ, ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రారంభంపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇది మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఢీలా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే ఈ సినిమా కోసం తాజాగా డైరెక్టర్ కొరటాల శివ తాజాగా స్క్రిప్టు వర్కు మొత్తాన్ని పూర్తి చేసుకున్నారట. అంతేకాదు, డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్టోరీని ఆయన కంప్లీట్ చేసుకున్నారని తెలిసింది. ఇక, దీన్ని తాజాగా హీరో ఎన్టీఆర్‌కు వినిపించగా.. అతడు సంతృప్తి వ్యక్తం చేశాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని కూడా వీళ్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, రేపో ఎల్లుండో ఈ సినిమా నుంచి అధికారిక అప్‌డేట్ కూడా రాబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు అందరి దృష్టినీ ఆకర్షించే శక్తిలా ఎలా ఎదిగాడు అన్న కథతో ఇది రాబోతుందట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











