War 2లో ఎన్టీఆర్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా? 2 ఏళ్లు కష్టపడితే..
గ్లోబల్ స్టార్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఇండియాలో కాకుండా విదేశాల్లోనూ ముఖ్యంగా యూఎస్, జపాన్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. దీంతో తారక్ అభిమానులు ఆయన నుంచి వచ్చే చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటించిన తొలి హిందీ చిత్రం వార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ డెబ్యూ..
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఈ చిత్రం తర్వాత నార్త్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆ చిత్రానికి ముందు వరకు రీజినల్ సినిమాలే చేశారు ఎన్టీఆర్. ఇక ఆర్ఆర్ఆర్ నుంచి పాన్ ఇండియా హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన తొలిచిత్రం వార్ 2. ఈ చిత్రం బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ గా రూపుదిద్దుకుంటోంది.

వార్ 2కి భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్..
లాక్ డౌన్ కు ముందు 2019లో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్, టైగర్ ఫ్రాష్ కలిసి నటించారు. అప్పుడు భారీ సక్సెస్ ను అందుకుంది. ఇక దానికి సీక్వెల్ గా వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం విశేషం. మరింత యాక్షన్, భారీ విజువల్స్ తో వస్తున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా రూ.400 కోట్ల వరకు బడ్జెట్ తో నిర్మించారు.
వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర నిడివి..
వార్ 2 చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత నాగ వంశీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన హక్కులను రికార్డ్ ధరకు కొనుగోలు చేశారంట. దీంతో సినిమాను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వార్ 2లో ఎన్టీఆర్ లుక్, యాక్షన్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పారు.
చిత్రంతో తారక్ ఒక్క 15 నిమిషాలు మినహా.. సినిమా మొత్తం ఉంటారని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఓ 30 నిమిషాలకు పైగా ఉంటారని అనుకుంటున్న సమయంలో ఫ్యాన్స్ కు నాగవంశీ గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా ప్రారంభమైన 15 నిమిషాలు మినహా ఎండింగ్ వరకు తారక్, హృతిక రోషన్ పోరాడుతూనే ఉంటారని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరోవైపు ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ తో సినిమాను అనౌన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











