Devara: జాన్వీ విషయంలో హర్ట్ అయ్యిన ఎన్టీఆర్
ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ ఎదురు చూస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా మార్చిన భారీ సినిమా "దేవర" అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది.
కాగా ఈ చిత్రం ఎన్టీఆర్ కొరటాల కలయికలో రెండో సినిమాగా వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం టోటల్ ఇండియా వైడ్ గా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ మేకర్స్ చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎన్టీఆర్ నుంచి సోలో పాన్ ఇండియా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని అగ్రెసివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ తనతో పాటుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నార్త్ సైడ్ గట్టిగా సినిమాని ప్రమోట్ చేస్తుంది. ఇలా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న తారక్ అండ్ టీం వీటిలోని సినిమాకి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. దీనితో ఇవి అభిమానుల్లో మంచి వైరల్ గా మారుతున్నాయి. ఇలా లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కాగా తారక్ ఫన్నీగా మాట్లాడుతూ జాన్వీ హైదరాబాద్ లో షూటింగ్ కి వచ్చినప్పుడు నేను చాలా సార్లు మా ఇంటికి పిలిచి భోజనం పెట్టానని కానీ కనీసం నన్ను ఒక్కసారిగా ముంబై వెళ్ళినపుడు వాళ్ళ ఇంటికి లంచ్ కి గాని డిన్నర్ కి గాని ఇన్వైట్ చేసింది లేదు. కనీసం ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చెయ్యలేదు అంటూ ఫేమస్ బాలీవుడ్ షో కపిల్ శర్మ టాక్ షోలో తారక్ జాన్వీ చేసిన విషయాన్ని నవ్వుతూ చెప్పేసాడు.

దీనితో తారక్ ని మాట్లాడనివ్వకుండా జాన్వీ ఆపేస్తూ మంచి ఫన్ గా షో ఎపిసోడ్ జరిగినట్టుగా కనిపిస్తుంది. కాగా ఈ షోని పాపులర్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేయగా ఈ షో ప్రతీ శనివారం రాత్రి 8 గంటలకి ప్రసారం కానుంది. సో ఇలా జాన్వీ అయితే తారక్ ని తిండి పెట్టకుండా హర్ట్ చేసిందట. కాగా ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
భారీ నెగిటివిటీని కూడా తట్టుకొని ఈ చిత్రం రిలీజ్ కి వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ బాగానే నమోదు చేస్తున్న సినిమా రాజమౌళి సెంటిమెంట్, అనిరుద్ సెంటిమెంట్ లతో రాబోతుంది. మరి వీటిలో ఏది నిజమవుతుందో దేవర ఫలితం అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా మారే పరిస్థితి ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











