NTR30: బ్యాడ్ న్యూస్.. NTR30 షూటింగ్ మరోసారి వాయిదా.. ఆ టార్గెట్ రీచ్ అవుతారా?
సుమారు ఐదు, ఆరు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా సత్తా చాటుతోంది. అంతేకాకుండా జపాన్ భాష జపనీస్ లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో NTR30 సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేసిన చిత్రీకరణ ప్రారంభం గురించి ఇంకా సందిగ్ధత వీడలేదు.

అనుకున్న సమయానికి..
దర్శక ధీరుడు జక్కన రాజమౌళితో రౌద్రం.. రణం.. రుధిరం (RRR) సినిమా పట్టాలపై ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి ఎలాంటి చిత్రీకరణను ప్రారంభించలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో మళ్లీ నందమూరి అభిమానుల్లో జోష్ వచ్చింది.

7 నెలల్లోనే ఫినిష్ చేయాలని..
NTR30 గ్లింప్స్ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ప్రాజెక్టులో ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్నోసార్లు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభ తేది మారుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను ముందుగా ఈ ఏడాది చివర్లో మొదలైనా అలాగే వచ్చే ఏడాది మొదట్లో మొదలైన కూడా కేవలం 7 నెలల్లోనే ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 2023 జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అవ్వాలని అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడిందని సమాచారం.

కారణాలపై లేని క్లారిటీ..
ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంం NTR30 సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ఫిబ్రవరి 2023లోనే ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. అసలు నెలకొన్న పరిస్థితులు ఏంటో.. షెడ్యూల్ ఎందుకు వాయిదా వేస్తున్నారన్న విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే సినిమా ప్రారంభోత్సవానికి మరో 3 నెలల సమయం పడుతుందని సమాచారం. ఎప్పుడు చిత్రీకరణ ప్రారంభం అయిన 7 నెలల్లో కంప్లీట్ చేయాలనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో వేచి చూడాలి. అయితే ఈ సినిమా విషయంలో కొరటాల శివ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలోనే ఇది కొత్త జానర్ అవుతుందని ఇదివరకు ఆయన చెప్పారు. పూర్తిగా కొత్త తరహా బ్యాక్ డ్రాప్ అని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేదని సమాచారం.


Click it and Unblock the Notifications











