కాస్తా ఫన్ మరికాస్తా ఎమోషన్… అన్ని మంచి శకునములే ట్రైలర్ టాక్

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా అడుగుపెట్టిన ఫిమేల్ డైరెక్టర్ నందిని రెడ్డి. మొదటి సినిమాతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఆమె దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు అవుతున్న ఇప్పటి వరకు చేసినవి నాలుగు సినిమాలే. అయితే నందిని రెడ్డి మూవీ అంటే ప్రేక్షకులలో ఒక రకమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.

ఆమె చివరిగా ఓ బేబీ సినిమాతో 2019లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మరల మూడేళ్ళ గ్యాప్ తర్వాత ప్రస్తుతం అన్ని మంచి శకునములే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సంతోష్ శోభన్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతోంది.

Jr ntr launched Anni Manchi Sakunamule movie telugu trailer

మే 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ లో ప్రియాంకా దత్ నిర్మించింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. జాతిరత్నాలు, సీతారామం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తోన్న మూవీ అన్ని మంచి శకునములే కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ట్రైలర్ లోకి వెళ్తే ఏ ఎమోషన్ అయిన కొద్దిసేపే అని అన్ని విషయాలని లైట్ గా తీసుకునే కుర్రాడు.

ప్రతిదానికి లెక్కలు కట్టి లైఫ్ ని హ్యాండిల్ చేసే అమ్మాయి మధ్య చిన్నప్పటి నుంచి స్నేహం, ప్రేమ, వారి కుటుంబంల మధ్య అనుబంధాల నడుమ కథని ఎంటర్టైనర్ గా ట్రైలర్ లో నందిని రెడ్డి నడిపించింది. రాజేంద్రప్రసాద్, నరేష్, ఒకప్పటి హీరోయిన్ గౌతమి, రావు రమేష్, తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.

అవసరానికి సరిపడా ఉన్నాక తరువాత ఎంత సంపాదించిన చిత్తు కాగితాలే కదా అనే డైలాగ్స్ మూవీలో కాస్తా ఎమోషనల్ షేడ్స్ లో ఆవిష్కరించింది. గౌతమి చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతోంది. అలాగే వాసుకి కూడా. ఫ్రెష్ ఫీల్ తో ఇటు ఎంటర్టైన్మెంట్, అటు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ మొత్తం కలిసి ఆశ్వాదించదగ్గ చిత్రంగా అన్నిమంచి శకునములే మూవీ ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. మరి ప్రేక్షకుల ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X