Devara 2 Leak: దేవర 2 మూవీపై ఎన్టీఆర్ బిగ్ లీక్.. స్టోరీ మొత్తం చెప్పేసిన యంగ్ టైగర్

గత ఏడాది 2024లో తెలుగు సినిమా నుంచి ఒకింత తక్కువ పాన్ ఇండియా సినిమాలే వచ్చాయని చెప్పాలి. కాగా మన బిగ్ స్టార్స్ నుంచి ఒకో క్వార్ట్రర్ లో ఒకో సినిమా వచ్చి అలరించింది. ఇలా టాలీవుడ్ నుంచి మొదట క్వార్ట్రర్ లో హను మాన్ వచ్చి పాన్ ఇండియా సెన్సేషన్ సెట్ చేస్తే ఈ తర్వాత వచ్చిన ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా రికార్డులు కొల్లగొట్టి పాన్ ఇండియా వైడ్ భారీ గ్రాసర్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన మరో బిగ్ చిత్రమే "దేవర". మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేసిన సినిమాగా వచ్చి సంచలనం సెట్ చేసింది. ఒకింత నెగిటివ్ టాక్ తోనే మొదలైనప్పటికీ అనిరుద్ సంగీతం అలానే ఎన్టీఆర్ మాస్ అభిమానులు ఈ సినిమాని గట్టిగా లేపారు.

Jr NTR leaked Devara 2 story

ఇలా తెలుగు స్టేట్స్ వరకు భారీ హిట్ అయ్యిన ఈ సినిమా కొనసాగిపుగా సీక్వెల్ ని కూడా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట దీనిని కూడా బాహుబలి తరహా లోనే సింగిల్ సినిమాగా అనుకున్నారు కానీ తెరకెక్కిస్తున్నపుడు కథ స్పాన్ పెరగడంతో ఇష్టం లేకపోయినప్పటికీ రెండు భాగాలుగా సినిమా మారాల్సి వచ్చింది. కాగా రిలీజ్ కి ముందే పార్ట్ 2 కి లీడ్ కూడా బాహుబలి 1 ఎండింగ్ లానే ఉంటుంది అని మేకర్స్ ముందే లీక్ ఇచ్చారు.

ఇక అలా ఉన్నప్పటికీ సినిమా పార్ట్ 2 కోసం ఇపుడు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఇపుడు పార్ట్ 2 పై నేరుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నే ఒక బిగ్ లీక్ ఇవ్వడం అనేది సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. కాగా పార్ట్ 1 ప్రమోషన్స్ నిమిత్తం ఎన్టీఆర్ ఇపుడు జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా తనతో పాటుగా దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడ ఉన్నారు.

అలా అక్కడ ఓ సంభాషణలో పార్ట్ 2 పై కీలక అంశాలు తారక్ లీక్ చేయడం జరిగింది. దేవర 2 కథ ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది అని ఖచ్చితంగా పార్ట్ ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది అని తారక్ రివీల్ చేసాడు. అంతే కాకుండా పార్ట్ 1 లో దేవర కోసం తెలుసుకున్నారు, కానీ పార్ట్ 2 కి వచ్చేసరికి దేవర కొడుకు వర కోసం తెలుసుకుంటారు. అలానే దేవర కి ఏమయ్యింది అనేది కూడా మీరు తెలుసుకుంటారు అంటూ పలు ఇంట్రెస్టింగ్ అంశాలని ఎన్టీఆర్ ముందే లీక్ చేసేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొత్తానికి మాత్రం దేవర 2 తో చాలా ప్రశ్నలని సమాధానాలు దొరికేలా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 అలానే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి తర్వాత దేవర 2 స్టార్ట్ చేస్తారట. ఈ ఏడాది చివర్లో గానీ.. వచ్చే ఏడాది గానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: devara jr ntr devara 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X