అర్జున్ S/o వైజయంతి కథ లీక్ చేసిన ఎన్టీఆర్.. అడ్డుకొన్న కల్యాణ్ రామ్!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలసు నిర్మాణంలో శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కథకు మూలం కర్తవ్యం అనుకొంటాను. కర్తవ్యంలో వైజయంతి పోలీస్ ఆఫీసర్‌కు కొడుకు పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అనుకొంటున్నాను. ఇలాంటి ఐడియా రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చూశాను. విజయశాంతి లేకపోతే సినిమా లేదు. పృథ్వీ లేకపోతే సినిమా లేదు. నిర్మాతలు, దర్శకులు లేకపోతే సినిమా లేదు. ఈ యూనిట్ అంతా కష్టపడి సినిమా చేసింది అని ఎన్టీఆర్ అన్నారు.

Jr NTR leaks Arjun S o Vyjayanthi story

ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. రాసిపెట్టుకోండి. ఆఖరుగా వచ్చే 20 నిమిషాలు థియేటర్‌లో ఉండే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకొంటారు. అంత అద్బుతంగా ఈ సినిమాను మలిచారు. ఈ సారి కాలర్ ఎగురవేయమని నేను చెబుతుంటాను. కానీ ఈసారి అన్నయ్యను కాలర్ ఎగరవేయమంటాను అని ఎన్టీఆర్ అంటే.. కల్యాణ్ రామ్ నిరాకరించాడు. దాంతో కల్యాణ్ రామ్ కాలర్‌ను ఎన్టీఆర్ ఎగురవేశాడు.

సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోవడం నా వల్ల కాలేదు. రేపు మీరు చూసినప్పుడు కూడా అదే మీకు జరుగుతుంది. ఆ క్లైమాక్స్ అలా రావడానికి కల్యాణ్ రామ్ కారణం. అయినా కల్యాణ్ రామ్ సినిమా ఐడియాను నమ్మకపోయి ఉంటే.. అంతా డెడికేషన్‌గా సినిమా చేయకపోతే ఇలా ఉండేది కాదనిపిస్తుంది అని ఎన్టీఆర్ అంటుంటే.. కల్యాణ్ రామ్ అడ్డుకొన్నాడు. దాంతో అన్నయ్య ఎన్నో సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా ఆయన కెరీర్‌లో బెస్ట్ అవుతుంది అని ఎన్టీఆర్ అన్నారు.

కల్యాణ్ రామ్ ప్రాణం పెట్టి.. మనసు పెట్టి చేశాడు. విజయశాంతిని అమ్మ పాత్రలో నమ్మారు. తల్లిగా ఆమెను నమ్మాడు కాబట్టే ఈ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు. అభిమానులు మీరు ఎంజాయ్ చేయండి. ఆగస్టు 14వ తేదీన వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా బాగా వచ్చింది. ఈ మూవీ గురించి తర్వాత మాట్లాడుతాను అని ఎన్టీఆర్ అన్నారు.

More from Filmibeat

Read more about: jr ntr kalyan ram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X