ఆర్ఆర్ఆర్ టీమ్‌కు షాక్.. పులితో యంగ్ టైగర్ పోరు.. లీకైన ఎన్టీఆర్ లుక్

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అంచనాలు ఆకాశన్నంటాయి. దాదాపు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.

అజయ్ దేవగణ్ జాయిన్..

అజయ్ దేవగణ్ జాయిన్..

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ జాయిన్ అయ్యాడు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ మూవీ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటోంది. వికారబాద్ అడువుల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్‌పై సీన్స్..

ఎన్టీఆర్‌పై సీన్స్..

ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై అదిరిపోయే సీన్స్ తెరకెక్కించబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వీటిని ఎంత గుట్టుగా ఉంచాలనుకుంటే అంత రచ్చగా తయారవుతోంది వ్యవహారం. ఇప్పటికే ఎన్టీఆర్ సీన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీకై పెద్ద దుమారమే రేగింది. తాజాగా అలాంటి సీనే ఒకటి జరిగింది.

పులితో ఫైట్..

పులితో ఫైట్..

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్‌ను భారీ రేంజ్‌లో ప్లాన్ చేశాడని ఇది వరకే వార్తలు వచ్చాయి. అవి నిజమనిపించేలా ఓ పిక్ బయటకు వచ్చింది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఓ పులితో తలపడనున్నట్లు తెలుస్తోంది. టార్జన్ లుక్‌లో ఎన్టీఆర్ లీకైన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Recommended Video

Eye-Feast For Ram Charan & Jr NTR Fans || SS Rajamouli Powerfull Plan For RRR
తలపట్టుకున్న రాజమౌళి..

తలపట్టుకున్న రాజమౌళి..

ఎంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పరిచిన ఇలా లీకువుతుండటంతో దర్శకధీరుడు తలపట్టుకున్నాడట. ఇక ఇలాంటివి ఉపేక్షించనని యూనిట్‌పై ఫైర్ అయ్యాడట. అరుకు షూటింగ్‌లో కొమురం భీమ్ వీడియో, ఇప్పుడు పులి ఫైట్‌కు సంబంధించిన ఫోటో లీకవడం నిజంగా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు షాకే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X