ఆ 40 నిమిషాలు మామూలుగా ఉండదు : దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎన్టీఆర్

Jr NTR on Devara: ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గూస్ బంప్స్ మూమెంట్ వచ్చేంది. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవరకు సంబంధించిన మరో భారీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్,గ్లింప్స్, సాంగ్స్ ఈ మూవీ పై ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ పెంచాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంది. దేవర లాంచ్ ఈవింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ క్లైమాక్స్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. దేవర లాంచ్ ఈవింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ క్లైమాక్స్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌లపై భారీ అంచనాలున్నాయనీ, దేవర మూవీలోని చివరి 40 నిమిషాలు మామూలుగా ఉండదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కైమాక్స్ చూసి ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూసేందుకు నిరీక్షించలేకున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ సృష్టించిన ఆ విజువల్స్‌ను చూసేందుకు తాను కూడా ఆత్రుతగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పేశారు.

Jr NTR made interesting comments that the last 40 minutes of the climax in Devara trailer launch event

దాదాపు ఆరేళ్ల తర్వాత తన సోలో మూవీ దేవర త్వరలో రిలీజ్ అవుతోందని, అందుకే కాస్త నార్వస్ గా, కాస్త టెన్షన్‍గా ఉందని జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జూ. ఎన్టీఆర్ లాస్ట్ సోలో మూవీ అరవింద సమేత 2018లో వచ్చింది. ఈ మూవీ తరువాత జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్‍చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే..

దేవర మూవీ ట్రైలర్ ఐదు భాషల్లో వచ్చింది. అదిరిపోయే యాక్షన్, విజువల్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ట్రైలర్‌ చూసినాక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతుంది. చాలాకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఊర మాస్ లుక్‏లో యాక్షన్ అదరగొట్టేశాడు. ఈ సారి ఎన్టీఆర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు.

Jr NTR made interesting comments that the last 40 minutes of the climax in Devara trailer launch event

ఇదెలా ఉంటే.. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. భైర అనే విలన్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైనా టామ్ చాకో, నరైన్, మురళి శర్మ, అజయ్ లీడ్ రోడ్ లో కనిపించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍ను వెచ్చించారు. ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ పక్కా బ్లాక్‍బస్టర్ అంటూ.. ఈ మూవీ రూ.1000కోట్ల కలెక్షన్ల మార్కును దాటేస్తుందనే అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: devara trailer devara ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X