కొరటాల ముఖంలో నవ్వు మాయం .. టెన్షన్‌తో వణుకుతూనే , దేవర సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ హాట్ కామెంట్స్
దర్శకుడు కొరటాల శివపై కీలక వ్యాఖ్యలు చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. శివ దర్శకత్వంలో తారక్ హీరోగా నటించిన దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టి.. కేవలం వారం తిరిగేలోగా నిర్మాతను ఒడ్డున పడేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
రైటర్ నుంచి దర్శకుడిగా మారిన కొరటాల శివ తన మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందించారు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి నాలుగు వరుస బ్లాక్ బస్టర్స్‌తో జోరు మీదున్న కొరటాల ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి సరసన నిలిచారు. ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు క్యూకట్టేవారు. అలాంటి టైంలో ఆచార్య సినిమా కొరటాల స్పీడుకు బ్రేకులు వేసింది. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ షాక్ నుంచి మెగా అభిమానులు బయటకు రాలేకపోయారు. ఆ వెంటనే కొరటాలను టార్గెట్ చేసిన ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. శివ కూడా చాలా రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఆయనతో నెక్ట్స్ ఎవరు సినిమా తీస్తారు, ఆచార్య ఫ్లాప్ నేపథ్యంలో ఏ పెద్ద హీరో అయినా శివకు ఛాన్స్ ఇస్తారా అంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసే సరికి టాలీవుడ్ షాక్ అయ్యింది.
ఓ సాలీడ్ హిట్ కొట్టి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు కొరటాల శివ. ఇటీవల ఓ కార్యక్రమంలో కొరటాల మాట్లాడుతూ.. మన పని మనల్ని చేసుకోనిస్తే రిజల్ట్ వేరేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆయన పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇంతలో సెప్టెంబర్ 27 రానే వచ్చి దేవర రిలీజైంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా వెళ్తోంది సినిమా. విడుదలైన తొలివారమే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది సరికొత్త చరిత్ర సృష్టించింది దేవర.
TARAK's superb speech at #Devara success meet
— Telugu360 (@Telugu360) October 4, 2024
కొరటాల శివ గారి మొహం లో నవ్వు ఎప్పుడూ చూడలేదు . భయపడుతూనే సినిమా చేశాడు
- ఎన్టీఆర్ pic.twitter.com/hExQnQAin3
ప్రీ రిలీజ్ కుదరకపోవడంతో దేవర సక్సెస్‌మీట్‌ను ఘనంగా చేయాలనుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దసరా సీజన్ మొదలు కావడంతో భద్రత దృష్ట్యా ఈ ఈవెంట్‌కు అనుమతులు దొరకలేదు. దీంతో అభిమానులకు చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పింది. దేవరకు పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లతో హైదరాబాద్‌లో ఓ మినీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొరటాలతో బృందావనం నుంచి అనుబంధం మొదలైందన్నారు. ఆయన మా ఇంట్లో సభ్యుడని.. ఎన్నోసార్లు కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచారని తారక్ తెలిపారు.
దేవర అనౌన్స్ చేసినప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వు లేదని.. ఈ సినిమా కోసం నిరంతరం ఆయన తాపత్రయపడ్డారని ఎన్టీఆర్ అన్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు శివ ఎంత టెన్షన్‌కు గురయ్యారో అనిరుధ్‌కు తెలుసునని చెప్పారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మొదట చెప్పింది అనిరుధేనని .. అంత టెన్షన్ నుంచి కొరటాల ముఖంలో ఆనందం కంటే ఓ మనశ్శాంతిని చూస్తున్నామన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











